Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేరళలో దారుణం.. ఆర్ఎస్ఎస్ కార్యకర్త దారుణ హత్య.. అల‌ప్పుజాలో బంద్ ప్రశాంతం

అల‌ప్పుజా జిల్లాలో బుధ‌వారం రాత్రి దారుణం జ‌రిగింది. రాష్ట్రీయ స్వయం సేవ‌క్ సంఘ్‌‌(ఆర్ఎస్ఎస్) కార్యక‌ర్తను అతి దారుణంగా హ‌త‌మార్చారు దుండగులు.

కేరళలో దారుణం.. ఆర్ఎస్ఎస్ కార్యకర్త దారుణ హత్య.. అల‌ప్పుజాలో బంద్ ప్రశాంతం
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 25, 2021 | 11:13 AM

కేరళలో మరోసారి రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. అల‌ప్పుజా జిల్లాలో బుధ‌వారం రాత్రి దారుణం జ‌రిగింది. రాష్ట్రీయ స్వయం సేవ‌క్ సంఘ్‌‌(ఆర్ఎస్ఎస్) కార్యక‌ర్తను అతి దారుణంగా హ‌త‌మార్చారు దుండగులు. చీర్తాల వ‌ద్ద బుధ‌వారం రాత్రి ఆర్ఎస్ఎస్, సోష‌ల్ డెమోక్ర‌టిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్‌డీపీఐ) కార్యక‌ర్తల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యక‌ర్త రాహుల్ కృష్ణా అలియాస్ నందుపై ఎస్‌డీపీఐ కార్యక‌ర్తలు దాడి చేశారు. దీంతో అత‌ను అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఘ‌ట‌నాస్థలికి చేరుకున్న పోలీసులు ఆందోళ‌న‌కారుల‌ను చెద‌ర‌గొట్టారు. మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. ఈ హ‌త్య కేసుతో సంబంధం ఉన్న 16 మంది ఎస్‌డీపీఐ కార్యక‌ర్తల‌ను పోలీసులు అరెస్టు చేశారు. రాహుల్ హ‌త్యకు నిర‌స‌న‌గా అల‌ప్పుజా జిల్లాలో ఆర్ఎస్ఎస్ బంద్‌కు పిలుపునిచ్చింది. అల‌ప్పుజాలో బంద్ ప్రశాంతంగా కొన‌సాగుతోంది.

కాసరగోడ్ నుంచి తిరువనంతపురానికి ‘విజయ యాత్ర’కు నాయకత్వం వహిస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్ ఈ హత్యను ఖండించారు. దీని వెనుక పిఎఫ్ఐ ఉందని ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై దాడులకు, సీఎం విజయన్ దుష్టపాలనకు అద్దం పడుతుందన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన దాడులకు తెగబడుతుందని ఆరోపించారు.

కేరళలోని అలప్పుజ జిల్లాలో బుధవారం రాత్రి రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) కార్యకర్త మృతి చెందాడు. మృతుడిని వయలార్‌కు చెందిన రాహుల్ కృష్ణగా గుర్తించారు. ఈ ఘర్షణలో పలువురు ఆర్‌ఎస్‌ఎస్, ఎస్‌డిపిఐ కార్యకర్తలు కూడా గాయపడ్డారు. ఈ సంఘటన తరువాత ఈ ప్రాంతంలో భారీ పోలీసు మోహరింపు ఉంది.

ఇదిలావుండగా, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త హత్య తర్వాత కేరళలోని అలప్పుజలో 12 గంటల షట్‌డౌన్ చేయాలని బిజెపి, ఇతర అనుబంధ సంస్థలు పిలుపునిచ్చాయి. ఈ సంఘటనను నిరసిస్తూ బిజెపి, ఇతర హిందూ సంస్థలు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అలప్పుజ జిల్లాలో బంద్‌ పాటిస్తున్నామని బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎంవి గోపకుమార్‌ తెలిపారు.

ఇదీ చదవండిః  

దెయ్యం భయంతో ఖాళీ అయిన ఊరు.. చూసినవారు చూసినట్టే చనిపోతున్నారని వణికిపోతున్న గ్రామం 

సముద్ర జలాల్లో ఏమి హాయిలే హల ! కేరళలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఏం చేశారంటే ? 

భాగ్యనగర వాసులను హడలెత్తించిన వీడియో.. బాలానగర్ ఫ్లైఓవర్ కుప్పకూలిందా..?:Balanagar flyover mishap viral video