AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుల్లితెర నటి చందన ఆత్మహత్య

సినిమాల్లో నటిగా రాణించాలని కలలు కంది. దాని కోసం పల్లెను వదిలి పట్నానికి చేరుకుంది. బుల్లితెరపై వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోలేదు. ఇంతలోనే ఓ నయవంచకుడి చేతిలో మోసపోయి ప్రాణాలు తీసుకుంది. దీంతో సినిమాల్లో నటించాలన్న కల నెరవేరకుండానే కన్నుమూసింది.

బుల్లితెర నటి చందన ఆత్మహత్య
Balaraju Goud
|

Updated on: Jun 02, 2020 | 10:23 AM

Share

సినిమాల్లో నటిగా రాణించాలని కలలు కంది. దాని కోసం పల్లెను వదిలి పట్నానికి చేరుకుంది. బుల్లితెరపై వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోలేదు. ఇంతలోనే ఓ నయవంచకుడి చేతిలో మోసపోయి ప్రాణాలు తీసుకుంది. దీంతో సినిమాల్లో నటిగా రాణించాలన్న కల నెరవేరకుండానే కన్నుమూసింది. కర్నాటక రాష్ట్రం హాసన్‌ జిల్లా బేలూరుకు చెందిన చందన సినిమాల్లో నటించాలని కోరికతో బెంగళూరుకు వచ్చింది. కన్నడ బుల్లితెరతో పాటు పలు ప్రకటనలు, సినిమాలో చిన్నచిన్న పాత్రల్లో ఆమె నటించింది. ఇంతలో ఓ వంచకుడి కన్ను చందనపై పడింది. ప్రేమ పేరుతో తీయని మాటలు చెప్పి ఐదేళ్లు మోజు తీర్చుకున్నాడు. తీరా పెళ్లి మాట వచ్చేసరికి ముఖం చాటేశాడు. దీంతో జరిగిన మోసానికి కుంగిపోయిన ఆ అభాగ్యురాలు బలవన్మరణానికి పాల్పడింది కన్నడ టీవీ నటి చందన. పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. కన్నడ సినిమాల్లో వెలుగొందాలని ఎన్నో కలలు కన్న చందన జీవితం చివరికి విషాదాంతమైంది. విషాన్ని తాగుతూ తనకు జరిగిన అన్యాయాన్ని సెల్ఫీ వీడియోలో చెప్పింది. ప్రియుడు దినేశ్‌ చేసిన మోసాలను ఏకరవుపెట్టిన చందన సెల్ఫీ వీడియోలో బోరుమంది. చందన తీసిన సెల్ఫీ వీడియో ఆధారంగా నిందితుడు దినేష్ పై కర్నాటక పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు భయంతో దినేశ్‌ పరారీలో ఉన్న నిందితుడు దినేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. చందన, దినేశ్‌లు ఐదేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇటీవల ప్రియుడు దినేష్ దగ్గర చందన పెళ్లి ప్రస్థావన తీసుకొచ్చింది. దీంతో ఐదేళ్లుగా చందనతో తిరిగిన దినేష్ పెళ్లి చేసుకోవాలని అడగగానే ముఖం చాటేశాడు. దీంతో ఏం చేయాలో తోచని చందన దినేశ్‌ కుటుంబసభ్యుల దగ్గర తమ ప్రేమ, పెళ్లి విషయాన్ని చెప్పింది. అయితే దినేష్ కుటుంబ సభ్యులు చందనను అవమానించి పంపారు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన ఆమె జీవితం మీద విరక్తి చెందిన చందన తన నివాసంలో పురుగుల మందు తాగింది. ఆ వీడియోను ప్రియునికి వాట్సప్‌ చేసింది. వెంటనే అక్కడికి చేరుకొని చందనను ఒక ఆస్పత్రికి తరలించి నిందితుడు దినేష్ పరారయ్యాడు. పురుగులమందు ఎక్కువగా తాగడంతో ఆమె కొంతసేపటికే ప్రాణాలు వదిలింది. డబ్బు, కెరీర్‌, జీవితాన్నే నీకు అర్పిస్తే మోసం చేస్తావా..,మరో అమ్మాయిని ఇలా మోసం చేయకు అంటూ వీడియోలో తెలిపింది. ఒక ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న దినేశ్‌ గతంలోనూ పలువురు అమ్మాయిలను ఇలానే మోసగించినట్లు ఆరోపణలున్నాయి. సెల్ఫీ వీడియో ఆధారంగా దినేశ్‌ కుటుంబ సభ్యులపైనా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు