మోదీని కల్వనున్న పవన్.. ఇక విలీనమేనా?
ప్రధాని నరేంద్ర మోదీతో జనసేనాధిపతి పవన్ కల్యాణ్ భేటీ దాదాపు కన్‌ఫర్మ్ అయ్యిందని విశ్వసనీయ సమాచారం. మోదీని కలిసేందుకు వైసీపీ అధినేత జగన్ కొంతకాలంగా ప్రయత్నం చేస్తుండగా.. లక్కు మాత్రం పవన్ కల్యాణ్‌కే దక్కనుందని అంటున్నారు. జగన్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా.. చంద్రబాబును దగ్గరికి రానీయకుండా చూస్తున్న నరేంద్ర మోదీ.. పవన్ కల్యాణ్‌ని కలిసేందుకు మొగ్గు చూపుతున్నారని ఢిల్లీ వర్గాల భోగట్టా. గత పదిహేను రోజులుగా పవన్ కల్యాణ్ చేస్తున్న కామెంట్లు ఆయన మరోసారి బిజెపికి దగ్గరవుతున్న సంకేతాల్నిచ్చాయి. […]
ప్రధాని నరేంద్ర మోదీతో జనసేనాధిపతి పవన్ కల్యాణ్ భేటీ దాదాపు కన్‌ఫర్మ్ అయ్యిందని విశ్వసనీయ సమాచారం. మోదీని కలిసేందుకు వైసీపీ అధినేత జగన్ కొంతకాలంగా ప్రయత్నం చేస్తుండగా.. లక్కు మాత్రం పవన్ కల్యాణ్‌కే దక్కనుందని అంటున్నారు. జగన్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా.. చంద్రబాబును దగ్గరికి రానీయకుండా చూస్తున్న నరేంద్ర మోదీ.. పవన్ కల్యాణ్‌ని కలిసేందుకు మొగ్గు చూపుతున్నారని ఢిల్లీ వర్గాల భోగట్టా.
గత పదిహేను రోజులుగా పవన్ కల్యాణ్ చేస్తున్న కామెంట్లు ఆయన మరోసారి బిజెపికి దగ్గరవుతున్న సంకేతాల్నిచ్చాయి. బిజెపి నుంచి తానెప్పుడూ దూరం జరగలేదని, ఆ పార్టీతో శతృత్వమేమీ లేదని అంటూ వస్తున్న పవన్ కల్యాణ్.. బిజెపికి పవన్ మన్మధబాణాలు విసురుతున్నట్లుగానే ప్రతీ ఒక్కరు విశ్లేషించారు. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ కల్యాణ్ చేసిన మరో పని ఆయన్ని మోదీకి మరింత దగ్గర చేసిందని బిజెపి వర్గాలంటున్నాయి.
ఇటీవల ఆర్మీ బలగాల సంక్షేమం కోసం తాను కోటి రూపాయలు విరాళంగా ఇవ్వబోతున్నానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇందులో పెద్ద న్యూసేమీ లేకపోయినా.. ఈ ప్రకటన చేస్తూ ఆయన మోదీ ఇచ్చిన పిలుపే తనకు స్పూర్తిగా నిలిచిందంటూ ప్రధానిని ఆకాశానికెత్తేశారు. సో.. ఇంకేముంది పెద్దాయన పూర్తిగా ప్రసన్నమైపోయినట్లు కమల నాథులే చెప్పుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో కోటి రూపాయల విరాళాన్ని తానే స్వయంగా ప్రధాని మోదీని కలిసి అంద చేస్తానని కూడా పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఈ మేరకు మోదీ అపాయింట్‌మెంట్ కోరడంతో ప్రధాని కార్యాలయం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అన్నీ కుదిరితే డిసెంబర్ 15కు కాస్త అటూ ఇటూగా పవన్ కల్యాణ్ ప్రధానితో భేటీ అవుతారని తెలుస్తోంది.
ఆ తర్వాత ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు ఖాయమని చెప్పుకుంటున్నారు. అయితే.. పవన్ కల్యాణ్ బిజెపిలో చేరతారా లేక పార్టీని విలీనం చేస్తారా అన్న చర్చ కూడా ఊపందుకుంది. ఎన్నికష్టాలెదురైనా మడమతిప్పనని తరచూ చెప్పుకుని పవన్.. బిజెపితో అంత ఈజీగా రాజీ పడతారా అన్నదిప్పుడు చర్చనీయాంశం.