బ్రేకింగ్: మంత్రి నారాయణ ఇంట్లో ఐటీ సోదాలు
మంత్రి నారాయణ కు చెందిన నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. మెడికల్ కాలేజీ కార్యాలయంతో పాటు మంత్రి నారాయణ ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దాదాపు నాలుగు బృందాలు ఈ రెండు చోట్లా సోదాలు నిర్వహిస్తున్నారట. ఎన్నికలు దగ్గరపడుతుండడం.. అదీ ప్రచార సమయంలో ఈ దాడులు జరగడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. ఇది ఇలా ఉంటే విజయనగరం జిల్లా చీపురుపల్లి సభలో చంద్రబాబు మాట్లాడుతూ కొద్దిరోజుల్లో దాడులు జరిగే అవకాశముందని అనుమానం […]
మంత్రి నారాయణ కు చెందిన నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. మెడికల్ కాలేజీ కార్యాలయంతో పాటు మంత్రి నారాయణ ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దాదాపు నాలుగు బృందాలు ఈ రెండు చోట్లా సోదాలు నిర్వహిస్తున్నారట. ఎన్నికలు దగ్గరపడుతుండడం.. అదీ ప్రచార సమయంలో ఈ దాడులు జరగడంతో అందరూ ఉలిక్కిపడ్డారు.
ఇది ఇలా ఉంటే విజయనగరం జిల్లా చీపురుపల్లి సభలో చంద్రబాబు మాట్లాడుతూ కొద్దిరోజుల్లో దాడులు జరిగే అవకాశముందని అనుమానం వ్యక్తం చేసిన కొద్ది నిమిషాల్లోనే ఈ దాడులు జరగడం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. కాగా ఈ దాడులు పై మంత్రి నారాయణ, అతని కుటుంబ సభ్యులు ఇంతవరకు స్పందించలేదు.