‘జెట్’ పైలట్లు రూట్ మారుస్తున్నారా?
డిల్లీ: అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్ గత మూడు నెలలుగా పైలట్లు, సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వట్లేదు. దీంతో వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ‘జెట్’ సిబ్బంది కంపెనీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తమ జీతాలు ఇప్పించమని కోరుతూ ప్రధాని మోదీ, కేంద్ర విమానయాన శాఖా మంత్రి సురేష్ ప్రభూలకు లేఖలు రాశారు. ఇప్పటికే వందల మంది ‘జెట్’ పైలట్లు.. ఇతర విమానయాన సంస్థలకు ఇంటర్య్వూలకు హజరవుతునట్టు సమాచారం. బోయింగ్ విమానాలు నడిపిన అనుభవం […]
డిల్లీ: అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్ గత మూడు నెలలుగా పైలట్లు, సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వట్లేదు. దీంతో వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ‘జెట్’ సిబ్బంది కంపెనీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తమ జీతాలు ఇప్పించమని కోరుతూ ప్రధాని మోదీ, కేంద్ర విమానయాన శాఖా మంత్రి సురేష్ ప్రభూలకు లేఖలు రాశారు. ఇప్పటికే వందల మంది ‘జెట్’ పైలట్లు.. ఇతర విమానయాన సంస్థలకు ఇంటర్య్వూలకు హజరవుతునట్టు సమాచారం. బోయింగ్ విమానాలు నడిపిన అనుభవం ఉన్న దాదాపు 260 మంది పైలట్లు స్పైస్‌జెట్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 150 మంది కెప్టెన్లు కూడా ఉన్నారు.మరో విమానయాన సంస్థ ఇండిగోకు కూడా పలువురు ‘జెట్’ సిబ్బంది దరఖాస్తు చేసుకుంటున్నారట.
ఒకవేళ జెట్ సంస్థ మూతపడితే 23,000 మంది సిబ్బంది తమ ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఇప్పటికే జీతాలు లేక సిబ్బంది పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. జెట్ ఎయిర్‌వేస్‌కు విమానాలను అద్దెకిచ్చిన మూడు కంపెనీలు గతవారం స్పైస్‌జెట్ ఛైర్మన్ అజయ్ సింగ్‌ను కలిశాయి. జెట్‌తో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుని ఈ విమానాలను స్పైస్‌జెట్‌కు లీజుకివ్వాలని ఆ కంపెనీలు యోచిస్తున్నాయి. ఇందుకు స్పైస్‌జెట్ కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. జెట్ ఎయిర్‌వేస్‌ను పునరుద్ధరించాలంటే ప్రస్తుత యాజమాన్యాన్ని మార్చాలని బ్యాంకర్లు ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం.