చంద్రబాబుపై మోహన్ బాబు ఫైర్
తిరుపతి: ఫీ రీఎంబర్స్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీనియర్ నటులు మోహన్‌బాబు అందోళనకు దిగారు. విద్యార్ధులకు వాగ్ధానంచేసినట్టుగా ఫీజులు చెల్లించాలని అన్నారు. చంద్రబాబు వ్యర్ధ వాగ్ధానాలు చేశారని, హామీలు నెరవేర్చడానికి డబ్బు లేనప్పుడు పసుపు కుంకుమ వంటి పథకాలకు డబ్బెలా వచ్చిందని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రజల డబ్బునే ప్రజలకు పంచి పెడుతున్నారని, విద్యార్ధులకు కూడా ఫీజు రింబర్స్‌మెంట్ ఇవ్వాలని మోహన్ బాబు అన్నారు. ఈ ఫీజు విషయంలో తాను ఎన్ని లెటర్లు రాసినా చంద్రబాబు స్పందించలేదని విమర్శించారు. […]
తిరుపతి: ఫీ రీఎంబర్స్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీనియర్ నటులు మోహన్‌బాబు అందోళనకు దిగారు. విద్యార్ధులకు వాగ్ధానంచేసినట్టుగా ఫీజులు చెల్లించాలని అన్నారు. చంద్రబాబు వ్యర్ధ వాగ్ధానాలు చేశారని, హామీలు నెరవేర్చడానికి డబ్బు లేనప్పుడు పసుపు కుంకుమ వంటి పథకాలకు డబ్బెలా వచ్చిందని ప్రశ్నించారు.
చంద్రబాబు ప్రజల డబ్బునే ప్రజలకు పంచి పెడుతున్నారని, విద్యార్ధులకు కూడా ఫీజు రింబర్స్‌మెంట్ ఇవ్వాలని మోహన్ బాబు అన్నారు. ఈ ఫీజు విషయంలో తాను ఎన్ని లెటర్లు రాసినా చంద్రబాబు స్పందించలేదని విమర్శించారు.
మొదట ర్యాలీ నిర్వహించాలని మోహన్ బాబు భావించారు. అయితే ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో పోలీసులు అనుమతించలేదు. దీంతో రోడ్డుపై మోహన్ బాబు భైటాయించారు. విద్యార్ధులు చాలా మంది పాల్గొన్నారు.