బంగారం ధరలకు రెక్కలు.. వెండి కూడా అదే బాటలో.. ఒక్కరోజే రూ.3 వేలు పెరుగుదల

గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలకు మళ్ళీ రెక్కలొచ్చాయి. బంగారంతోపాటు దేశంలోని పలు మార్కెట్లలో వెండి ధరలు కూడా భగ్గుమన్నాయి. డిసెంబర్ 8...

బంగారం ధరలకు రెక్కలు.. వెండి కూడా అదే బాటలో.. ఒక్కరోజే రూ.3 వేలు పెరుగుదల
Follow us

|

Updated on: Dec 08, 2020 | 6:55 PM

Huge spike in Gold silver prices: గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలకు మళ్ళీ రెక్కలొచ్చాయి. బంగారంతోపాటు దేశంలోని పలు మార్కెట్లలో వెండి ధరలు కూడా భగ్గుమన్నాయి. డిసెంబర్ 8 మంగళవారం గోల్డు ధర 10 గ్రాములకు 816 రూపాయలు పెరిగింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల బంగారం 49 వేల 430 రూపాయలు పలికింది. అటు వెండి కూడా బంగారం బాటలోనే భగ్గుమన్నది.కొనుగోళ్ళు పెరగడంతో వెండి ధర ఒక్కరోజే ఏకంగా 3 వేల 63 పెరిగింది. దీంతో కిలో వెండి ధర 64 వేల 361 రూపాయలకు పెరిగింది.

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 పాజిటివ్‌ కేసులు మళ్లీ పెరుగుతుండడం, ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం వంటి అంశాలపై అమెరికా ఫెడ్‌ అధికారులు ఆందోళన వ్యక్తం చేసిన క్రమంలో బంగారం కొనుగోళ్ళలో పెట్టుబడులు పెట్టడమే శ్రేయస్కరమని మదుపర్లు భావించారు. దీంతో అంతర్జాతీయంగా గోల్డు ధర ఒక్కసారిగా పెరిగింది. ఇది దేశీయ ధరలపైనా ప్రభావం చూపించింది. దీంతో పాటు స్థానికంగా నగల వ్యాపారులు, పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ ఊపందుకోవడంతో ఇండియాలో బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ తపన్‌ పటేల్‌ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,864 అమెరికన్‌ డాలర్లు, ఔన్సు వెండి ధర 24.52 డాలర్లు పలికింది.