రేణిగుంట పేలుడు ఘటనపై దక్షిణ మధ్య రైల్వే వివరణ, ట్రాక్ పై పేలుడు జరగలేదు: టీవీ9తో సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో
చిత్తూరుజిల్లా రేణిగుంట రైల్వే ట్రాక్ దగ్గర పేలుడు ఘటనపై దక్షిణ మధ్య రైల్వే వివరణ ఇచ్చింది. రైల్వే ట్రాక్ పై పేలుడు జరగలేదని...
చిత్తూరుజిల్లా రేణిగుంట రైల్వే ట్రాక్ దగ్గర పేలుడు ఘటనపై దక్షిణ మధ్య రైల్వే వివరణ ఇచ్చింది. రైల్వే ట్రాక్ పై పేలుడు జరగలేదని పేర్కొంది. రైల్వే పట్టాలకు సమీపంలో జరిగిందని వెల్లడించింది. రైల్వే ట్రాక్ కు ఆనుకుని ఉన్న పంట పొలాల్లోకి పందులు లాంటి జంతువులు రాకుండా ఉండటంకోసం ఇలాంటి పేలుడు పదార్థాలు పెట్టి ఉంటారని భావిస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు. పేలుడు గురించి రైల్వే ప్రయాణీకులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్ టీవీ9కు చెప్పారు. బ్రేకింగ్ న్యూస్: తిరుపతి సమీపంలో రైల్వే ట్రాక్‌పై పేలిన బాంబు…తీవ్రంగా గాయపడిన మహిళ