India Vs Australia 2020: చివరిలో విఫలమైన భారత్ బ్యాట్స్‌మెన్.. ఆసీస్ సూపర్ విక్టరీ..

Ravi Kiran

|

Updated on: Dec 08, 2020 | 8:07 PM

టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీ వేదికగా ఆఖరి టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

India Vs Australia 2020: చివరిలో విఫలమైన భారత్ బ్యాట్స్‌మెన్.. ఆసీస్ సూపర్ విక్టరీ..

India Vs Australia 2020: టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీ వేదికగా ఆఖరి టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకుని ఆతిధ్య ఆసీస్‌ను బ్యాటింగ్‌కు దింపాడు. మ్యాక్సీ(54), వేడ్(80) చెలరేగిపోవడంతో ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లకు 186/5 పరుగులు చేసింది.

ఇక 187 పరుగుల భారీ లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన టీమిండియాకు కెప్టెన్ విరాట్ కోహ్లీ(85) చక్కటి ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే చివరి ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో భారత్ 20 ఓవర్లకు 174/7 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనితో ఆసీస్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 08 Dec 2020 05:23 PM (IST)

    20 ఓవర్లకు భారత్ 174-7, ఆసీస్ విజయం..

    20 ఓవర్లకు భారత్ 174-7. ఈ ఓవర్ లో భారత్ 14 పరుగులు రాబట్టింది. సుందర్(7) పెవిలియన్ చేరాడు.

  • 08 Dec 2020 05:23 PM (IST)

    19 ఓవర్లకు భారత్ 160-6..

    19 ఓవర్లకు భారత్ 160-6. ఈ ఓవర్ లో భారత్ 9 పరుగులు రాబట్టింది. విరాట్ కోహ్లీ(85) పెవిలియన్ చేరాడు.

  • 08 Dec 2020 05:23 PM (IST)

    17 ఓవర్లకు భారత్ 144-4

    17 ఓవర్లకు భారత్ 144-4. ఈ ఓవర్ లో భారత్ 13 పరుగులు రాబట్టింది. పాండ్యా ఒక సిక్స్, ఒక ఫోర్ బాదాడు.

  • 08 Dec 2020 05:23 PM (IST)

    18 ఓవర్లకు భారత్ 151-5

    18 ఓవర్లకు భారత్ 151-5. ఈ ఓవర్ లో భారత్ 7 పరుగులు రాబట్టింది. హార్దిక్ పాండ్యా(20) పెవిలియన్ చేరాడు.

  • 08 Dec 2020 05:03 PM (IST)

    16 ఓవర్లకు భారత్ 131-4

    16 ఓవర్లకు భారత్ 131-4. ఈ ఓవర్ లో కోహ్లీ రెండు సిక్స్ లు.. హార్దిక్ పాండ్యా ఒక సిక్స్ బాదాడు.

  • 08 Dec 2020 04:55 PM (IST)

    14 ఓవర్లకు భారత్ 109-4

    14 ఓవర్లకు భారత్ 109-4. అబాట్ వేసిన ఈ ఓవర్ లో టీమిండియా 9 పరుగులు రాబట్టింది. కోహ్లీ ఓ భారీ సిక్స్ ను బాదాడు.

  • 08 Dec 2020 04:51 PM (IST)

    అర్ధ శతకం పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ..

    187 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 10 పరుగుల వ్యక్తిగత స్కోర్  వద్ద స్మిత్ కు లైఫ్ రావడంతో.. మళ్లీ అలాంటి ఛాన్స్ కు తావు ఇవ్వకుండా జాగ్రత్తగా ఆడాడు.

  • 08 Dec 2020 04:49 PM (IST)

    ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు..

    13 ఓవర్లకు భారత్ 100-4. స్వీప్సన్ వేసిన ఈ ఓవర్ లో భారత్ రెండు కీలక వికెట్లను కోల్పోయింది. శాంసన్(10), శ్రేయాస్ అయ్యర్(0) వెంటవెంటనే ఔట్ అయ్యారు.

  • 08 Dec 2020 04:41 PM (IST)

    12 ఓవర్లకు భారత్ 94-2..

    12 ఓవర్లకు భారత్ 94-2. ఈ ఓవర్ లో భారత్ 7 పరుగులు రాబట్టింది. కోహ్లీ(50), శాంసన్(10) వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెడుతున్నారు. ఈ ఓవర్ లో శాంసన్ నాలుగు సింగిల్స్, కోహ్లీ మూడు సింగిల్స్ తీశారు.

  • 08 Dec 2020 04:36 PM (IST)

    11 ఓవర్లకు భారత్ 87-2…

    11 ఓవర్లకు భారత్ 87-2. ఈ ఓవర్ లో భారత్ ఐదు పరుగులు రాబట్టింది. కోహ్లీ(47), శాంసన్(6) వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెడుతున్నారు. ఈ ఓవర్ లో శాంసన్ రెండు సింగిల్స్, కోహ్లీ మూడు సింగిల్స్ తీశారు.

  • 08 Dec 2020 04:32 PM (IST)

    10 ఓవర్లకు భారత్ 82-2

    10 ఓవర్లకు భారత్ 82-2. ఈ ఓవర్ లో భారత్ ఏడు పరుగులు రాబట్టింది. కోహ్లీ(44), శాంసన్(4) వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెడుతున్నారు.

  • 08 Dec 2020 04:30 PM (IST)

    9 ఓవర్లకు భారత్ 75-2

    9 ఓవర్లకు భారత్ 75-2. ఈ ఓవర్ లో ధావన్(28) సామ్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.  స్వీప్సన్ వేసిన ఈ ఓవర్ లో భారత్ 6 పరుగులు రాబట్టింది. సంజూ శాంసన్ కొత్తగా క్రీజులోకి వచ్చాడు.

  • 08 Dec 2020 04:23 PM (IST)

    ఎనిమిది ఓవర్లకు భారత్ 69-1

    ఎనిమిది ఓవర్లకు భారత్ 69-1. ఈ ఓవర్ లో ధావన్ మొదటి బంతికి ఫోర్ కొట్టి..రెండు సింగిల్స్ తీయగా.. కోహ్లీ ఓ రెండు సింగిల్స్ తీశాడు. మ్యాక్సీ వేసిన ఈ ఓవర్ లో భారత్ 8 పరుగులు రాబట్టింది.

  • 08 Dec 2020 04:21 PM (IST)

    ఏడు ఓవర్లకు భారత్ 61-1

    ఏడు ఓవర్లకు భారత్ 61-1. ఈ ఓవర్ లో కోహ్లీ, ధావన్ ఆరు సింగిల్స్ చేశారు. స్వీప్సన్ వేసిన ఈ ఓవర్ లో భారత్ 6 పరుగులు రాబట్టింది.

  • 08 Dec 2020 04:17 PM (IST)

    ఒకే ఓవర్‌లో మూడు ఫోర్లు..

    ఆరు ఓవర్లకు భారత్ 55/1. ఈ ఓవర్ లో విరాట్ కోహ్లీ ఒక ఫోర్.. ధావన్ రెండు ఫోర్లు బాదాడు. అబాట్ వేసిన ఈ ఓవర్ లో భారత్ 15 పరుగులు రాబట్టింది.

  • 08 Dec 2020 04:16 PM (IST)

    ఐదు ఓవర్లకు భారత్ 40/1

    ఐదు ఓవర్లకు భారత్ 40/1. ఈ ఓవర్ లో విరాట్ కోహ్లీ ఒక ఫోర్ బాది.. రెండు పరుగులు చేశాడు. మరోవైపు ధావన్(9) ఒక సింగిల్ తీశాడు. టై వేసిన ఈ ఓవర్ లో భారత్ 7 పరుగులు రాబట్టింది.

  • 08 Dec 2020 04:13 PM (IST)

    నాలుగు ఓవర్లకు భారత్ 33/1

    నాలుగు ఓవర్లకు భారత్ 33/1. ఈ ఓవర్ లో మొదటి బంతికి విరాట్ కోహ్లీ ఫోర్ బాదాడు. మరోవైపు ధావన్(8) నిలకడగా ఆడుతున్నాడు.  సామ్స్ వేసిన ఈ ఓవర్ లో భారత్ 10 పరుగులు రాబట్టింది.

  • 08 Dec 2020 04:07 PM (IST)

    మూడు ఓవర్లకు భారత్ 23/1

    మూడు ఓవర్లకు భారత్ 23/1. ఈ ఓవర్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(12)కి లైఫ్ వచ్చింది. కోహ్లీ ఇచ్చిన క్యాచ్ ను బౌండరీ లైన్ దగ్గర స్మిత్ అందుకోలేకపోయాడు. మ్యాక్సీ వేసిన ఈ ఓవర్ లో భారత్ 8 పరుగులు రాబట్టింది.

  • 08 Dec 2020 04:05 PM (IST)

    రెండో ఓవర్‌లో 11 పరుగులు..

    అబాట్ వేసిన రెండో ఓవర్ లో భారత్ 11 పరుగులు రాబట్టింది. విరాట్ కోహ్లీ(8), ధావన్(5) వికెట్ల మధ్య వేగంగా పరుగులు చేస్తున్నారు.

  • 08 Dec 2020 04:02 PM (IST)

    మొదటి ఓవర్‌లో ఇండియా 4/1, రాహుల్ డకౌట్..

    మాక్స్ వెల్ వేసిన మొదటి ఓవర్లో భారత్ నాలుగు పరుగులు రాబట్టింది. ధావన్(2), కోహ్లీ(2) చెరో రెండు సింగిల్స్ తీశారు. ఈ ఓవర్‌లో భారత్ రాహుల్(0) వికెట్ కోల్పోయింది.

  • 08 Dec 2020 03:58 PM (IST)

    మొదటి బంతికే తొలి వికెట్.. రాహుల్ డకౌట్..

    ఆరంభంలోనే టీమిండియాకు భారీ షాక్ తగిలింది. మంచి ఫామ్‌లో ఉన్న రాహుల్(0)ను మాక్స్‌వెల్ పెవిలియన్‌కు పంపించాడు. భారీ షాట్ ఆడబోయిన రాహుల్.. బౌండరీ లైన్ వద్ద స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

  • 08 Dec 2020 03:31 PM (IST)

    చివరి ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా..

  • 08 Dec 2020 03:29 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. వేడ్(80) ఔట్..

  • 08 Dec 2020 03:28 PM (IST)

    18 ఓవర్లకు ఆస్ట్రేలియా 168-2

    18 వ ఓవర్ లో ఆస్ట్రేలియా 11 పరుగులు రాబట్టింది. మాక్స్ వెల్(52), వేడ్ (80) క్రీజులో ఉన్నారు.

  • 08 Dec 2020 03:14 PM (IST)

    17 ఓవర్లకు ఆస్ట్రేలియా 157/2

    17వ ఓవర్ లో ఆస్ట్రేలియా 12 పరుగులు రాబట్టింది. మాక్స్ వెల్46(28), వేడ్76(50) ఆకాశమే హద్దుగా. చెలరేగిపోతున్నారు. ఈ ఓవర్‌లో మాక్స్ వెల్ భారీ సిక్స్ బాదాడు.

  • 08 Dec 2020 03:04 PM (IST)

    15 ఓవర్‌లో రెండు సిక్స్ లు.. ఆసీస్ 139-2

  • 08 Dec 2020 03:02 PM (IST)

    14 ఓవర్లకు ఆస్ట్రేలియా 124-2

  • 08 Dec 2020 03:00 PM (IST)

    12 ఓవర్లకు ఆస్ట్రేలియా 101/2

    ఈ ఓవర్ లో ఆస్ట్రేలియా 14 పరుగులు రాబట్టింది. క్రీజులో వేడ్(58), మాక్స్‌వెల్(11) ఉన్నారు.

  • 08 Dec 2020 02:35 PM (IST)

    10 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా 82/2

    ఈ ఓవర్‌లో స్టీవ్ స్మిత్(24) పెవిలియన్ చేరాడు. ఒక పక్క ఫోర్లతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టిస్తున్నాడు. ప్రస్తుతం క్రీజులో వేడ్(48), మాక్స్‌వెల్(3) ఉన్నారు.

  • 08 Dec 2020 02:35 PM (IST)

    9 ఓవర్లకు ఆస్ట్రేలియా 73-1

    ఈ ఓవర్‌లో ఆస్ట్రేలియా 5 పరుగులు రాబట్టింది. ఓవర్ ముగిసేసరికి క్రీజులో స్మిత్(18), వేడ్(48) ఉన్నారు.

  • 08 Dec 2020 02:35 PM (IST)

    ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా 68-1

    ఈ ఓవర్‌లో వేడ్ ఒక ఫోర్ బాదాడు. ఇక మిగిలినవన్నీ సింగిల్స్‌ రూపంలో పరుగులు వచ్చాయి. ఓవర్ ముగిసేసరికి క్రీజులో స్మిత్(15), వేడ్(46) ఉన్నారు.

  • 08 Dec 2020 02:21 PM (IST)

    ఏడు ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా 59-1

    ఏడో ఓవర్‌లో ఆస్ట్రేలియా ఎనిమిది పరుగులు రాబట్టింది. ఈ ఓవర్‌లో వేడ్, స్మిత్‌లు సింగిల్స్ రూపంలో పరుగులు చేశారు. ఓవర్ ముగిసేసరికి స్మిత్(12), వేడ్(40) క్రీజులో ఉన్నారు.

  • 08 Dec 2020 02:19 PM (IST)

    ఆరు ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా 51-1

    ఆరో ఓవర్‌లో ఆస్ట్రేలియా ఆరు పరుగులు రాబట్టింది. వేడ్‌ ఒక సింగిల్, స్మిత్ రెండు సింగిల్స్‌ తీశాడు. ఈ ఓవర్లో ఒక త్రీడీ కూడా వచ్చింది. ‌ఓవర్ ముగిసేసరికి స్మిత్(10), వేడ్(34) క్రీజులో ఉన్నారు.

  • 08 Dec 2020 02:08 PM (IST)

    స్కోర్ బోర్డు పరుగులు పెట్టిస్తున్న వేడ్.. 5 ఓవర్లకు ఆస్ట్రేలియా 45/1

    చాహర్ వేసిన ఐదో ఓవర్‌లో వేడ్ మొదటి రెండు బంతులు ఫోర్లు బాదాడు. మొత్తంగా ఈ ఓవర్‌లో ఆస్ట్రేలియా 17 పరుగులు రాబట్టింది. స్టీవ్ స్మిత్, వేడ్ చెరో మూడు పరుగులు తీయగా.. ఇద్దరూ మరో రెండు సింగిల్స్ చేశారు. దీనితో ఓవర్ ముగిసేసరికి  స్మిత్(6), వేడ్(32) క్రీజులో ఉన్నారు.

  • 08 Dec 2020 02:04 PM (IST)

    ఫోర్లుతో హోరెత్తిస్తున్న వేడ్.. నాలుగు ఓవర్లకు ఆస్ట్రేలియా 28/1

    నాలుగో ఓవర్‌లో ఆస్ట్రేలియా 12 పరుగులు రాబట్టింది. ఈ ఓవర్‌లో వేడ్ లెగ్ సైడ్ మీదుగా చక్కటి ఫోర్ బాదాడు. ఇక ఓవర్ ముగిసేసరికి స్మిత్(2), వేడ్(20) క్రీజులో ఉన్నారు.

  • 08 Dec 2020 02:00 PM (IST)

    మూడో ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా 16-1

    మూడో ఓవర్‌లో ఆస్ట్రేలియా కేవలం రెండు పరుగులు మాత్రమే రాబట్టింది. స్మిత్, వేడ్‌లు చెరో సింగిల్‌లు తీశారు. ఓవర్ ముగిసేసరికి స్మిత్(1), వేడ్(15) క్రీజులో ఉన్నారు.

  • 08 Dec 2020 01:58 PM (IST)

    మొదటి వికెట్ కోల్పోయిన ఆసీస్.. కెప్టెన్ ఫించ్ డకౌట్..

    సుందర్ వేసిన రెండో ఓవర్‌లో ఆస్ట్రేలియా జట్టు తొలి వికెట్‌ను కోల్పోయింది. భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన ఫించ్ మిడ్-ఆఫ్‌లో ఉన్న హార్దిక్ పాండ్యాకు దొరికిపోయాడు. ఈ ఓవర్‌లో వేడ్ ఒక ఫోర్, ఓ సింగిల్ రాబట్టాడు. రెండు ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ స్కోర్ ఒక్క వికెట్ నష్టానికి 14 పరుగులు. క్రీజులో వేడ్(14), స్టీవ్ స్మిత్(0) ఉన్నారు.

  • 08 Dec 2020 01:53 PM (IST)

    మొదటి ఓవర్‌లో రెండు ఫోర్లు బాదిన వేడ్.. ఓవర్ ముగిసేసరికి ఆస్ట్రేలియా 9/0

    మొదటి ఓవర్‌లో ఆస్ట్రేలియా 9 పరుగులు రాబట్టింది. దీపక్ చాహర్ వేసిన ఈ ఓవర్‌లో మాథ్యూ వేడ్ రెండు ఫోర్లు బాదాడు. మొదటి ఓవర్ ముగిసేసరికి ఆస్ట్రేలియా 9/0, క్రీజులో వేడ్(9), ఫించ్(0) ఉన్నారు.

Follow us