ఇండియాలో మూడు కోట్ల వ్యాక్సిన్ల స్టోరేజీకి రెడీ, ఢిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాల్లో ఏర్పాట్లు

సుమారు మూడు కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లను స్టోర్ చేసేందుకు దేశంలో ఏర్పాట్లు ఉన్నాయని కేంద్రం  ప్రకటించింది. రానున్న మరికొన్నివారాలు, నెలల్లోఅందుబాటులోకి రానున్న కోట్లాది డోసుల టీకాలమందులను స్టోర్ చేయడానికి ఉష్ణోగ్రతలను..

ఇండియాలో మూడు కోట్ల వ్యాక్సిన్ల స్టోరేజీకి రెడీ, ఢిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాల్లో ఏర్పాట్లు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 08, 2020 | 7:10 PM

సుమారు మూడు కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లను స్టోర్ చేసేందుకు దేశంలో ఏర్పాట్లు ఉన్నాయని కేంద్రం  ప్రకటించింది. రానున్న మరికొన్నివారాలు, నెలల్లోఅందుబాటులోకి రానున్న కోట్లాది డోసుల టీకాలమందులను స్టోర్ చేయడానికి ఉష్ణోగ్రతలను అదుపు చేయగల కంటెయినర్లు, జోన్ల ఏర్పాటుకు ఢిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాల్లో సన్నాహాలు ప్రారంభమయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటికే ఈ ఎయిర్ పోర్టుల్లో ఆధునిక ఫార్మా వ్యాక్సిన్ స్టోరేజీ, ప్రాసెసింగ్ జోన్లు, ప్రత్యేక కూల్ ఛాంబర్లు ఉన్నాయి. ఇవి మైనస్ 20 డిగ్రీల ఉషోగ్రతతో కూడినవి. అలాగే ప్రత్యేక ట్రాలీలు సైతం ఉన్నాయి అని ఈ శాఖ వెల్లడించింది.

కరోనా వైరస్ తొలి రోజుల్లో ఈ రెండు విమానాశ్రయాల నుంచి కోట్లాది పీపీఈ కిట్లు, మందులు రవాణా అయ్యాయి. ఇక ఇండియాలో తమ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతించాలంటూ సీరం కంపెనీ, ఫైజర్, భారత్ బయో టెక్ సంస్థల అభ్యర్థనలను పరిశీలించేందుకు నిపుణులతో కూడిన కమిటీ ఒకటి బుధవారం సమావేశమవుతోంది. హైదరాబాద్ లోని భారత్ బయో టెక్ కొవాగ్జిన్ వ్యాక్సిన్ ని, పూణే లోని సీరం కంపెనీ  ఆస్ట్రాజెనికా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీల సహకారంతో కోవిషీల్డ్ టీకామందును ఉత్పత్తి చేస్తున్నాయి. ఫైజర్ వ్యాక్సిన్ ని మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ లో ఉంచాల్సి ఉంటుంది. హాస్పిటల్స్ లోని రిఫ్రిజిరేషన్  యూనిట్లలో దీన్ని 5 రోజులపాటు నిల్వ ఉంచవచ్చు.

మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!