ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు చుక్కెదురు.. పేరు తొలగించేందుకు హైకోర్టు నిరాకరణ…
తెలంగాణలో కలకలం సృష్టించిన ఓటుకు నోటు కేసులో నిందితుడు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు నిరాశే ఎదురైంది. కేసు నుంచి తన పేరును తొలగించాలని ఎమ్మెల్యే డిశ్చార్జ్ పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్‌ను హైకోర్టు డిసెంబర్‌ను 8న కొట్టివేసింది.
తెలంగాణలో కలకలం సృష్టించిన ఓటుకు నోటు కేసులో నిందితుడు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు నిరాశే ఎదురైంది. కేసు నుంచి తన పేరును తొలగించాలని ఎమ్మెల్యే డిశ్చార్జ్ పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్‌ను హైకోర్టు డిసెంబర్‌ను 8న కొట్టివేసింది. కేసుల్లో మినహాయింపు కోసం పిటిషన్లను అనుమతించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా, ఓటుకు నోటు కేసును ఏసీబీ కోర్టు విచారిస్తోంది. ఈ నెల 15న కోర్టు విచారణకు నిందితులు కచ్చితంగా హాజరు కావాలని ఆదేశించింది.
తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫన్ సన్ ను ప్రలోభాలకు గురి చేసిన ఆరోపణలతో అప్పటి టీడీపీ నేతలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఉదయ సింహాలపై ఏసీబీ కోర్టు కేసు నమోదు చేసింది. నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫన్ సన్‌కు రేవంత్ రెడ్డి 50 లక్షల నగదును ఇస్తున్న వీడియోలు సైతం అప్పట్లో కలకలం సృష్టించాయి. అంతేకాకుండా, స్టీఫన్ సన్ తో పలువురు టీడీపీ నేతలు మాట్లాడిన ఆడియోలు సైతం అప్పట్లో వెలుగు చూశాయి. కాగా ఇదే కేసులో ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి జైలుకెళ్లాడు.