రేపు హైదరాబాద్‌లో 80 దేశాల రాయబారులు, హైకమిషనర్ల బృందం పర్యటన, కీలక పరిశోధన, అభివృద్ధి సంస్థల సందర్శన

సుమారు 80 దేశాల రాయబారులు, హైకమిషనర్ల బృందం రేపు (9వ తేదీ) హైదరాబాద్‌లోని కీలక పరిశోధన, అభివృద్ధి సంస్థలను...

  • Venkata Narayana
  • Publish Date - 6:25 pm, Tue, 8 December 20
రేపు హైదరాబాద్‌లో 80 దేశాల రాయబారులు, హైకమిషనర్ల బృందం పర్యటన, కీలక పరిశోధన, అభివృద్ధి సంస్థల సందర్శన

సుమారు 80 దేశాల రాయబారులు, హైకమిషనర్ల బృందం రేపు (9వ తేదీ) హైదరాబాద్‌లోని కీలక పరిశోధన, అభివృద్ధి సంస్థలను సందర్శించనుంది. కోవిడ్ పై జరుగుతున్న కొన్ని కీలక పరిశోధన, ఇంకా, అభివృద్ధి కార్యకలాపాల గురించి సంస్థ ప్రతినిధులతో చర్చించనుంది. విదేశీ రాయబారులను పరిశోధనా సంస్థలకు పరిచయం చేయడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ఉన్నత స్థాయి సందర్శనను నిర్వహిస్తోంది. ఈ బృందం దేశంలో కోవిడ్ 19 వ్యాక్సిన్‌పై పనిచేస్తున్న భారత్ బయోటెక్ లిమిటెడ్, ఇ బయోలాజికల్స్ లిమిటెడ్‌ను కూడా సందర్శించే అవకాశం ఉంది.