జన్‌ధన్‌ ఖాతాదారులకు మరో శుభవార్త..! సోమవారం నుంచి..

ప్రధాన మంత్రి జన్‌ ధన్ ఖాతా కలిగిన మహిళలందరికీ కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. రెండో విడతగా రూ.500/- జమ చేసేందుకు బ్యాంకులన్నీ రెడీ అయ్యాయి. ఫైనాన్షియల్ సేవల విభాగం నిర్ణయించిన మే నెలలోని ఉపసంహరణ ప్రణాళిక ప్రకారం.. ఈ డబ్బు జమా కానుంది. సదరు మహిళల జన్ ధన్ అకౌంట్‌ నంబర్‌లో చివరి నంబరు 0,1తో ముగుస్తాయో.. వారి అకౌంట్లలో సోమవారం జమా కానుంది. అంతేకాదు అదే రోజు వారి అకౌంట్‌ నుంచి తీసుకోవచ్చు కూడా. అలాగే […]

జన్‌ధన్‌ ఖాతాదారులకు మరో శుభవార్త..! సోమవారం నుంచి..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 02, 2020 | 7:54 PM

ప్రధాన మంత్రి జన్‌ ధన్ ఖాతా కలిగిన మహిళలందరికీ కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. రెండో విడతగా రూ.500/- జమ చేసేందుకు బ్యాంకులన్నీ రెడీ అయ్యాయి. ఫైనాన్షియల్ సేవల విభాగం నిర్ణయించిన మే నెలలోని ఉపసంహరణ ప్రణాళిక ప్రకారం.. ఈ డబ్బు జమా కానుంది. సదరు మహిళల జన్ ధన్ అకౌంట్‌ నంబర్‌లో చివరి నంబరు 0,1తో ముగుస్తాయో.. వారి అకౌంట్లలో సోమవారం జమా కానుంది. అంతేకాదు అదే రోజు వారి అకౌంట్‌ నుంచి తీసుకోవచ్చు కూడా. అలాగే అకౌంట్‌ చివర 2, 3 నంబర్లతో ముగిసే ఖాతాదారులు మే 5వ తేదీన.. 4,5 నంబర్లతో అకౌంట్‌ ఉన్న వారు మే 6వ తేదీన విత్ డ్రా చేసుకోవచ్చు. అలాగే అకౌంట్‌ చివరన 6, 7 నంబర్లు ఉన్న వారు.. మే 8వ తేదీన, 8, 9 నంబర్లతో ముగిసే అకౌంట్‌ నంబర్‌ ఉన్న వారు మే 11వ తేదీన.. వారి వారి అకౌంట్‌ల నుంచి రూ.500/- విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపింది. ఇక మే 11వ తేదీ తర్వాత ఎప్పుడైనా వారి వారి సౌకర్యాన్ని బల్లి డబ్బులు తీసుకోవచ్చని అధికారులు తెలిపారు.

కాగా.. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీలో భాగంగా.. మోదీ సర్కార్.. మూడు నెలల పాటు ప్రధాన్ మంత్రి జన్‌ధన్‌ ఖాతా దారులందరి అకౌంట్‌లలో రూ. 500 చొప్పున జమచేయనుంది. ఇప్పటికే గత నెల తొలి విడత ముగియగా.. రెండో విడతగా.. మే 4వ తేదీన జమా చేయనుంది. మహిళల జన్‌ధన్ అకౌంట్‌ల మే నెల విడుదల చేయాల్సిన ఇన్‌స్టాల్‌మెంట్ సొమ్మును బ్యాంకులకు రిలీజ్‌ చేసినట్లు బ్యాంకింగ్ సెక్రటరీ దేబాశిష్ పాండా శనివారం పేర్కొన్నారు.