120 నుంచి 130 స్థానాల్లో గెలుస్తాం- సీఎం రమేష్

జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ 120 నుంచి 130 సీట్లు సాధించి తిరిగి అధికారం సొంతం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ సీనియర్ లీడర్, ఎంపీ సీఎం రమేష్. ఎంపీ స్థానాలు కూడా 18 పైచిలుకు టీడీపీ గెలుచుకుంటుందని  జోస్యం చెప్పారు. పెరిగిన ఓట్ల శాతం ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్లనే జరిగిందని  చెప్పారు. కడపలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో 5 టీడీపీనే గెలుచుకుంటుదని…2 సీట్లలో మాత్రం టఫ్ ఫైట్ […]

120 నుంచి 130 స్థానాల్లో గెలుస్తాం- సీఎం రమేష్
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 11, 2019 | 8:00 PM

జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ 120 నుంచి 130 సీట్లు సాధించి తిరిగి అధికారం సొంతం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ సీనియర్ లీడర్, ఎంపీ సీఎం రమేష్. ఎంపీ స్థానాలు కూడా 18 పైచిలుకు టీడీపీ గెలుచుకుంటుందని  జోస్యం చెప్పారు. పెరిగిన ఓట్ల శాతం ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్లనే జరిగిందని  చెప్పారు. కడపలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో 5 టీడీపీనే గెలుచుకుంటుదని…2 సీట్లలో మాత్రం టఫ్ ఫైట్ ఉంటుదన్నారు. టీవీ 9 నిర్వహించే ‘బిగ్ న్యూస్ బిగ్ డిబేట్’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్‌మోహన్ రెడ్డి చేసిన ఒక్కసారి సీఎం రిక్వెస్ట్‌ను కూడా ప్రజలు తిరస్కరించారని చెప్పుకొచ్చారు. ఆంధ్రుల భవిష్యత్‌ను చంద్రబాబు అయితే సరైన పథంలో తీసుకెళ్లగలరని ప్రజలు బలంగా నమ్మారని విశ్వాసం వ్యక్తం చేశారు.