ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ లభ్యం
చెన్నై ఏయిర్‌పోర్టు డ్రగ్స్ ఇన్‌కమింగ్ పాయింట్‌గా మారిపోయింది. డ్రగ్స్ పట్టుబడని రోజంటూ లేనివిధంగా పరిస్థితి మారిపోయింది. తాజాగా మంగళవారం కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో భారీగా డ్రగ్స్ దొరికాయి.
Drugs seized in Chennai airport: చెన్నై ఏయిర్‌పోర్టు డ్రగ్స్ ఇన్‌కమింగ్ పాయింట్‌గా మారిపోయింది. డ్రగ్స్ పట్టుబడని రోజంటూ లేనివిధంగా పరిస్థితి మారిపోయింది. తాజాగా మంగళవారం చెన్నై విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ తేవడానికి ట్రై చేసిన నలుగురిని అరెస్టు చేశారు. మనం నిత్యం వినియోగించే వస్తువుల ప్యాకెట్లలో డ్రగ్స్ చేసేందుకు వీరు ప్రయత్నించి, దొరికిపోయారు.
నిత్యం ఉపయోగించే ప్రముఖ కంపనీల పసుపు, సాంబార్, ఉప్పు, మసాలా, ప్యాకెట్లలో కిలో లెక్కన డ్రగ్స్ సరఫరా చేస్తోంది ఈ గ్యాంగ్. తమిళనాడు నుండి ఇంటర్నేషనల్ కొరియర్ ద్వారా ఆస్ట్రేలియా దేశాలకు పసుపు, సాంబార్, ఉప్పు, మసాలా, ప్యాకెట్లను ఎగుమతి చేస్తుండగా అందులో డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు సమాచారం అందుకున్న కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
పార్సెళ్ళను తనిఖీ చేసిన అధికారులకు దిమ్మ దిరిగేలా కిలోల లెక్కన డ్రగ్స్ దొరికాయి. మూడు కేజీల డ్రగ్స్ లభించగా వాటి విలువ సుమారు 30 లక్షల రూపాయలని కస్టమ్స్ అధికారులు అంఛనా వేశారు. తమిళనాడు-కేరళ బోర్డర్‌లోని తేని ప్రాంతానికి చెందిన నలుగురికి ఈ డ్రగ్స్ దందాతో సంబంధం వుందని భావించి వారిని అదుపులోకి తీసుకున్నారు.
Also read: తెలంగాణవ్యాప్తంగా రెడ్ అలర్ట్
Also read: తీరం దాటింది.. అయినా ఉత్తరాంధ్రకు ముప్పే!
Also read: రాజధాని రైతులపై చంద్రబాబు ప్రశంసల జల్లు
Also read: చంద్రబాబుకు నోటీసిచ్చిన తహసీల్దార్
Also read: ప్రభుత్వంపై కోర్టుకెక్కిన సినీ నిర్మాత
Also read: ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీలు