స్టాఫ్ నర్స్ కు కరోనా.. పేషంట్లు పరేషాన్

గత నెల రోజులుగా విధి నిర్వహణలో భాగంగా బిజీగా ఉన్న ఒక స్టాఫ్ నర్సుకు కరోనా వైరస్ సోకడం నీలోఫర్ ఆస్పత్రిలో కలకలం రేపుతోంది.

స్టాఫ్ నర్స్ కు కరోనా.. పేషంట్లు పరేషాన్
Follow us

|

Updated on: Apr 28, 2020 | 9:35 AM

గత నెల రోజులుగా విధి నిర్వహణలో భాగంగా బిజీగా ఉన్న ఒక స్టాఫ్ నర్సుకు కరోనా వైరస్ సోకడం నీలోఫర్ ఆస్పత్రిలో కలకలం రేపుతోంది. ఆమె 15 రోజుల క్రితం కరోనా వైరస్ పాజిటివ్ కనిపించిన రోగులకు ఆమె చికిత్స అందించడమే అందుకు కారణం. ఆ తర్వాత ఆ స్టాఫ్ నర్స్ మరికొందరు రోగులకు వైద్య సేవలు అందించిన ఈ నేపథ్యంలో వారంతా ఇప్పుడు ఆందోళనకు గురవుతున్నారు.

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం ప్రొద్దుటూర్ గ్రామానికి చెందిన 30 ఏళ్ల స్టాఫ్ నర్స్ నీలోఫర్ ఆసుపత్రిలో పనిచేస్తుంది. గత కొంత కాలంగా పలువురు కరోనా బాధితులకు వైద్య సేవలు అందించారు స్టాఫ్ నర్స్. అయితే ఆమెకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని అనుమానం రావడంతో ఆదివారం వైద్య పరీక్షలు నిర్వహించారు. వాటి రిపోర్టు మంగళవారం ఉదయం రావడంతో వాటిని పరిశీలించారు. స్టాఫ్ నర్సుకు కరోనా పాజిటివ్ అని తేలింది.

ఆదివారం నుంచి రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దుటూరు గ్రామంలోని తన సొంత ఇంట్లో హోమ్ క్వారెంటెన్ లో ఉన్న ఈ స్టాఫ్ నర్స్ ను మరికాసేపట్లో గాంధీ ఆసుపత్రికి తరలించనున్నారు. గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో స్టాఫ్ నర్స్ చికిత్స అందిస్తామని, పరిస్థితి ఆందోళనకరంగా ఏమీ లేదని ఆమె కుటుంబ సభ్యులకు వైద్య అధికారులు ధైర్యం చెబుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు పలువురు ఆమె కుటుంబానికి సాయం అందించేందుకు ముందుకొచ్చారు.

ఇది చదవండి: కరోనా వైరస్ తో డాక్టర్ మృతి