AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా: న్యూయార్క్ తోసహా 9 రాష్ట్రాలపై అంక్షలు..!

కరోనా బాధితులతో పాటు మరణాల సంఖ్య కూడా అగ్రరాజ్యం అమెరికాలో ఎక్కువగా ఉంటోంది. ఇదే పరిస్థితి కొనసాగితే మరింత దుర్భర పరిస్థితి ఎదుర్కోవల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కరోనా: న్యూయార్క్ తోసహా 9 రాష్ట్రాలపై అంక్షలు..!
Balaraju Goud
|

Updated on: Jun 25, 2020 | 6:32 PM

Share

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అగ్రరాజ్యం చిరుగుటాకులా వణుకుతోంది. రోజు రోజుకి పెరుగుతున్న కొవిడ్ కేసుల సంఖ్య మరింత ఆందోళన కలిగిస్తోంది. వైరస్ కి పుట్టినిల్లైన చైనాను కాదని అత్యధిక కేసులతో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. కరోనా బాధితులతో పాటు మరణాల సంఖ్య కూడా అగ్రరాజ్యంలోనే ఎక్కువగా ఉంటోంది. ఇదే పరిస్థితి కొనసాగితే మరింత దుర్భర పరిస్థితి ఎదుర్కోవల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అగ్రరాజ్యంలో కరోనా కట్టడిలో భాగంగా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని దక్షిణ మరియు పశ్చిమ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. కేసులతో పాటు మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే రెండు మిలియన్లకు పైగా అమెరికన్లు కరోనా బారినపడగా, లక్ష ఇరవై వేలకు పైగా మరణాలు సంభవించినటక్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వాషింగ్టన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల అంచనా ప్రకారం అక్టోబర్ నాటికి 1,80,000 మందికి పైగా మరణాలు ఉంటాయంటున్నారు. కరోనా పట్ల జనంలో మరింత అవగాహన రావల్సిన అవసరముందంటున్నారు. కరోనా వ్యాప్తి చెందడానికి రాబోయే వారాలు కీలకమైనవని ఆరోగ్య అధికారులు అంటున్నారు ప్రస్తుతం, ఆ రాష్ట్రాలు అలబామా, అర్కాన్సాస్, అరిజోనా, ఫ్లోరిడా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, టెక్సాస్, వాషింగ్టన్ రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నదని న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ క్యూమో తెలిపారు. ఇక ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప జనసమూహంలో వెళ్లవద్దని.. తప్పనిసరి అయితే మాస్క్ ధరించాలన్నారు. వైరస్ కేసులు పెరుగుతున్న రాష్ట్రాల నుండి న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాలకు వచ్చేవారిని 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని నిర్ణయించారు. స్వీయ దిగ్బంధాన్ని ఉల్లంఘించిన వారికి 1,000 నుంచి 5,000 అమెరికన్ డాలర్ల వరకు జరిమాను ఉంటుందని మిస్టర్ క్యూమో తెలిపారు.

Follow Us
కృష్ణతో సినిమా తీస్తున్నానని ఎన్టీఆర్‌కి కోపం వచ్చింది.!
కృష్ణతో సినిమా తీస్తున్నానని ఎన్టీఆర్‌కి కోపం వచ్చింది.!
మీ దగ్గర డబ్బు నిలవడం లేదా? ఈ 5 తప్పులు మీ కొంప ముంచుతాయి!
మీ దగ్గర డబ్బు నిలవడం లేదా? ఈ 5 తప్పులు మీ కొంప ముంచుతాయి!
కష్టకాలంలో భారత్‌కు నిజమైన స్నేహితులు వీరే..!
కష్టకాలంలో భారత్‌కు నిజమైన స్నేహితులు వీరే..!
‘దావూద్’ బతికే ఉన్నాడా? డీ-కంపెనీ చీకటి సామ్రాజ్యం వెనుక నిజాలివే
‘దావూద్’ బతికే ఉన్నాడా? డీ-కంపెనీ చీకటి సామ్రాజ్యం వెనుక నిజాలివే
తెల్లవారుజామునే కలలో ఇవి కనిపించాయా? అయితే మీ పంట పడినట్లే!
తెల్లవారుజామునే కలలో ఇవి కనిపించాయా? అయితే మీ పంట పడినట్లే!
చిరంజీవితో స్వయంకృషి సినిమా.. ఆ సంఘటనే కారణం..
చిరంజీవితో స్వయంకృషి సినిమా.. ఆ సంఘటనే కారణం..
భారతదేశంలో టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. బెస్ట్‌ మైలేజీ..!
భారతదేశంలో టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. బెస్ట్‌ మైలేజీ..!
ఐపీఎల్ హిస్టరీలో భారీ జరిమానా.. అయ్యర్ పరిస్థితి అగమ్యగోచరం
ఐపీఎల్ హిస్టరీలో భారీ జరిమానా.. అయ్యర్ పరిస్థితి అగమ్యగోచరం
పెళ్లి విందులో మందు లేదా.. అయితే పైసలివ్వాల్సిందే
పెళ్లి విందులో మందు లేదా.. అయితే పైసలివ్వాల్సిందే
లోపల గ్యాస్ ఎంత ఉందో బయటి నుంచే కనిపించే సిలిండర్లు వచ్చేశాయ్..
లోపల గ్యాస్ ఎంత ఉందో బయటి నుంచే కనిపించే సిలిండర్లు వచ్చేశాయ్..