ఏపీ కోవిడ్ అప్‌డేట్.. అవి తగ్గడం గుడ్‌న్యూసేనా?

ఏపీ కోవిడ్ అప్‌డేట్.. అవి తగ్గడం గుడ్‌న్యూసేనా?

ఏపీలో కరోనా వైరస్ ప్రభావం క్రమంగా తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా సోమవారం సాయంత్రం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే.. ప్రతిరోజు కరోనా వైరస్ బారిన పడుతున్న...

Rajesh Sharma

|

Nov 09, 2020 | 6:40 PM

Coronavirus impact coming down in Andhra: ఏపీలో కరోనా వైరస్ ప్రభావం క్రమంగా తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా సోమవారం సాయంత్రం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే.. ప్రతిరోజు కరోనా వైరస్ బారిన పడుతున్న వారికంటే దాని బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీన్ని శుభ సంకేతంగా వైద్య వర్గాలు చెబుతున్నాయి.

తాజాగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు ఏపీలో నమోదైన గణాంకాలను ఏపీ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో మొత్తం 61 వేల 50 కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 1,391 మందికి పాజిటివ్‌గా తేలింది. కరోనా బారిన పడిన వారిలో గత 24 గంటల్లో 11 మంది మరణించారు. అదే సమయంలో వైరస్ సోకిన వారిలో 1,549 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు.

ఇదిలా వుండగా.. రాష్ట్రంలో సోమవారం నాటికి మొత్తం 87 లక్షల 25 వేల 25 కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు కమాండ్ కంట్రోల్ సెంటర్ వెల్లడించింది. మొత్తం 8 లక్షల 44 వేల 359 మందికి కరోనా వైరస్ సోకింది. వారిలో 8 లక్షల 16 వేల 322 మంది కోలుకోగా.. ప్రస్తుతం 21 వేల 235 కరోనా పాజిటివ్ యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా సోకి 6 వేల 802 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా గత 24 గంటల్లో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. మొత్తం అయిదు జిల్లాల్లో మూడంకెల్లో కేసులు నమోదు కాగా.. 8 జిల్లాల్లో రెండంకెల్లోనే కేసులు నమోదవడం వైరస్ ప్రభావం తగ్గుతుందనడానికి నిదర్శనమని వైద్య వర్గాలంటున్నాయి. అయితే అంత మాత్రాన నిర్లక్ష్యం వద్దని, కరోనా ప్రీకాషన్స్ తప్పకుండా మరి కొంత కాలం పాటించాల్సిందేనని సూచిస్తున్నాయి.

ALSO READ: సేవ్ మాన్సస్ ప్రచారంపై మండిపడ్డ సంచయిత

ALSO READ: సిటీ ట్రాఫిక్ జామ్‌కు కేటీఆర్ చెక్

జీహెచ్ఎంసీకి హడ్కో అవార్డు.. కేటీఆర్ ప్రశంస

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu