జీహెచ్ఎంసీకి హడ్కో అవార్డు.. కేటీఆర్ ప్రశంస

తెలంగాణ మునిసిపల్ మంత్రి కే.తారక రామారావు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ అధికారులను అభినందించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ హడ్కో ప్రతీ ఏటా ఇచ్చే ప్రశంసాపూర్వక అవార్డును గెలుచుకున్నందుకు మంత్రి జీహెచ్ఎంసీ అధికారులను పొగడ్తలతో ముంచెత్తారు.

జీహెచ్ఎంసీకి హడ్కో అవార్డు.. కేటీఆర్ ప్రశంస
Follow us

|

Updated on: Nov 07, 2020 | 7:04 PM

Hudco award for GHMC: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పేదల ఆత్మగౌరవ ఇళ్లకు జాతీయ స్థాయిలో హడ్కో బెస్ట్ ప్రాక్టీస్ అవార్డు లభించేలా కృషి చేసిన అధికారులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అభినందించారు. శనివారం ప్రగతి భవన్ లో పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, గృహనిర్మాణ విభాగం ఓ.ఎస్.డి సురేష్ కుమార్.. మంత్రి కె.టి.ఆర్.ను కలిసి హడ్కో అవార్డు గురించి వివరించారు. నగరంలో పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా భావిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ నిర్మాణానికి రూ. 8598 కోట్ల నిధులు కేటాయించామని, ఒక లక్ష రెండు పడక గదుల ఇళ్లను మంజూరు చేశామని అధికారుల బృందం మంత్రి కె.టి.ఆర్.కు వివరించారు. వినూత్న సాంకేతిక ప‌రిజ్ఞానంతో గేటెడ్ కమ్యునిటీ అపార్ట్ మెంట్లు, ఇళ్లకు ధీటుగా అన్ని మౌలిక వసతులతో నాణ్యతతో నిర్మిస్తున్న అధికారులను మంత్రి అభినందించారు.

ALSO READ: జీహెచ్ఎంసీ వినూత్న ప్రయోగం.. ‘ఆ’ వ్యర్థాలకు రీసైక్లింగ్‌తో చెక్

ALSO READ: నాగేంద్రకు 14 రోజుల రిమాండ్

ALSO READ: కేంద్రం ఒక్క పైసా ఇవ్వలే.. మండిపడ్డ కేసీఆర్

ALSO READ: బీహార్‌లో అధికారం వారిదే.. తేల్చిన ఎగ్జిట్ పోల్స్