త్వరలోనే మార్కెట్‌లోకి కోవిడ్ వ్యాక్సిన్!

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్న తరుణంలో కోవాక్జిన్ ట్రయల్స్ కీలక దశకు చేరుకున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మూడో దశ పూర్తయ్యిందే తడవుగా దేశవ్యాప్తంగా కరోనాకు విరుగుడుగా భావిస్తున్న వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు రంగం సిద్దమవుతోంది.

త్వరలోనే మార్కెట్‌లోకి కోవిడ్ వ్యాక్సిన్!
Follow us

|

Updated on: Nov 09, 2020 | 7:03 PM

Covid vaccine in market soon: కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్న తరుణంలో కోవాక్జిన్ ట్రయల్స్ కీలక దశకు చేరుకున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దీపావళి తర్వాత కోవాక్జిన్ మూడో దశ ట్రయల్స్‌కు రంగం సిద్దమవుతోంది. దీపావళి తర్వాత ఎంపిక చేసిన వాలెంటీర్లపై ప్రయోగాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం వాలెంటీర్ల ఎంపిక దాదాపు పూర్తి అయ్యింది. సోమవారం వంద మంది వాలెంటీర్లను ధృవీకరించారు.

దీపావళి పండుగ తర్వాత మూడో దశ కోవాక్జిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమవుతున్నాయి. మూడో దశలో గర్భిణులు, చిన్నారులు, వృద్ధులపై కోవాక్జిన్ వ్యాక్సిన్ ప్రయోగించనున్నారు. ఇందుకోసం వంద మంది గర్భిణులను, చిన్నారులను, వృద్ధులను ఎంపిక చేశారు. మొదటి రెండు దశలను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న కోవాక్జిన్ తుది, మూడో దశ కూడా పూర్తి చేసుకుంటే ఆ తర్వాత డీజీసీఏ అనుమతితో దేశవ్యాప్తంగా మార్కెట్‌లోకి రానున్నది.

మరోవైపు కోవాక్జిన్ తుది దశ పూర్తి కాగానే దేశంలో పెద్ద ఎత్తున సరఫరా చేసేందుకు దశల వారీగా దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ ఉచితంగా వేయించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్ రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. అదే సమయంలో వ్యాక్సిన్ పంపిణీకి అనుసరించనున్న విధానాన్ని కూడా తెలియజేయాలని రాష్ట్రాల ప్రభుత్వాలను కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది.

ALSO READ: ఏపీ కోవిడ్ అప్‌డేట్.. అవి తగ్గడం గుడ్‌న్యూసేనా?

ALSO READ: సిటీ ట్రాఫిక్ జామ్‌కు కేటీఆర్ చెక్

ALSO READ: సేవ్ మాన్సస్ ప్రచారంపై మండిపడ్డ సంచయిత