ఉగ్రదాడిని కాంగ్రెస్ ఖండిస్తోంది : సీఎల్పీ నేత భట్టి
హైదరాబాద్ : పుల్వమా ఉగ్రదాడిని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ శాసనసభలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమర్ధిస్తున్నామన్నారు. జవాన్లు దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. దేశ ఆర్థిక, రక్షణ వ్యవస్థలను దెబ్బతీసేందుకే ఈ ఉగ్రదాడులని వ్యాఖ్యానించారు. యావత్ దేశం అమరజవాన్ల కుటుంబాలకు అండగా ఉంటాయన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. నిఘా వ్యవస్థలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. […]
హైదరాబాద్ : పుల్వమా ఉగ్రదాడిని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ శాసనసభలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమర్ధిస్తున్నామన్నారు. జవాన్లు దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. దేశ ఆర్థిక, రక్షణ వ్యవస్థలను దెబ్బతీసేందుకే ఈ ఉగ్రదాడులని వ్యాఖ్యానించారు. యావత్ దేశం అమరజవాన్ల కుటుంబాలకు అండగా ఉంటాయన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. నిఘా వ్యవస్థలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అమర జవాన్ల కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తున్న సాయాన్ని అభినందిస్తున్నామని భట్టి విక్రమార్క అన్నారు.