తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఆర్థికశాఖను తన వద్దే ఉంచుకోవడంతో… ఆర్థికమంత్రిగా ఆయన బడ్జెట్ ప్రసంగాన్ని చదివి వినిపిస్తున్నారు. అంతకు ముందు పుల్వామా అమరవీరులకు సభ నివాళి అర్పించింది. అనంతరం టీబ్రేక్ కోసం సభ వాయిదా పడింది. సభ పున:ప్రారంభమైన అనంతరం కేసీఆర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. గతంలో ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్ రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాసు బ్రహ్మానంద రెడ్డి, […]

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన కేసీఆర్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 22, 2019 | 12:55 PM

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఆర్థికశాఖను తన వద్దే ఉంచుకోవడంతో… ఆర్థికమంత్రిగా ఆయన బడ్జెట్ ప్రసంగాన్ని చదివి వినిపిస్తున్నారు. అంతకు ముందు పుల్వామా అమరవీరులకు సభ నివాళి అర్పించింది. అనంతరం టీబ్రేక్ కోసం సభ వాయిదా పడింది. సభ పున:ప్రారంభమైన అనంతరం కేసీఆర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. గతంలో ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్ రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాసు బ్రహ్మానంద రెడ్డి, రోశయ్యలు ముఖ్యమంత్రులుగా ఉండి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. వీరి తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి సీఎంగా కేసీఆర్ నిలిచిపోయారు.