చ౦ద్రబాబుపై రోజా తీవ్ర విమర్శలు

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏపీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. తనను రాజకీయంగా ఎదిరించిన వారిని అడ్డు తొలగించుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. గతంలో మాధవరెడ్డి, పరిటాల రవిలను అలాగే చంద్రబాబు అడ్డు తొలగించుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కుమ్మకై వైఎస్ జగన్‌ను అనేక కేసుల్లో ఇరికించారని రోజా ఆరోపించారు. జగన్ తప్పు చేయలేదు కాబట్టే ధైర్యంగా కోర్టు విచారణకు హాజరవుతున్నారన్నారు. ఆయన కేసుల నుంచి కడిగిన ముత్యంలా బయటపడతారని ధీమా వ్యక్తం […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:24 pm, Fri, 22 February 19
చ౦ద్రబాబుపై రోజా తీవ్ర విమర్శలు

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏపీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. తనను రాజకీయంగా ఎదిరించిన వారిని అడ్డు తొలగించుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. గతంలో మాధవరెడ్డి, పరిటాల రవిలను అలాగే చంద్రబాబు అడ్డు తొలగించుకున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కుమ్మకై వైఎస్ జగన్‌ను అనేక కేసుల్లో ఇరికించారని రోజా ఆరోపించారు. జగన్ తప్పు చేయలేదు కాబట్టే ధైర్యంగా కోర్టు విచారణకు హాజరవుతున్నారన్నారు. ఆయన కేసుల నుంచి కడిగిన ముత్యంలా బయటపడతారని ధీమా వ్యక్తం చేశారు. 18కేసుల్లో స్టేలు తెచ్చుకున్న ముద్దాయి చంద్రబాబు, జగన్ కేసుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. రౌడీ ఎమ్మెల్యే చింతమనేనికి ప్రభుత్వ విప్ పదవి కట్టబెట్టి ప్రజల మీదకు వదిలేశారని మండిపడ్డారు.