నేడు కేరళకు టీఆర్ఎస్ ఎంపీ కవిత
హైదరాబాద్ : నిజామాబాద్ ఎంపీ కవిత నేడు కేరళకు వెళ్లనున్నారు. కేరళ అసెంబ్లీ ఆధ్వర్యంలో నిర్వహించే నేషనల్ స్టూడెంట్ పార్లమెంట్ సదస్సులో ప్రసంగించాలని ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఆహ్వానం మేరకు కవిత వెళ్లనున్నారు. కేరళ శాసనసభ వజ్రోత్సవాల సందర్భంగా కాస్ట్ అండ్ ఇట్స్ డిస్కౌంట్స్ అనే అంశంపై ప్రసంగిస్తారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ, పుణెకు చెందిన ఎంఐటీ పీస్ వర్సిటీ సంయుక్తంగా ఫెస్టివల్ ఆన్ డెమొక్రసీ (ఎఫ్‌వోడీ) పేరిట పలు జాతీయస్థాయి సదస్సులు నిర్వహిస్తున్నాయి. అందులో […]
హైదరాబాద్ : నిజామాబాద్ ఎంపీ కవిత నేడు కేరళకు వెళ్లనున్నారు. కేరళ అసెంబ్లీ ఆధ్వర్యంలో నిర్వహించే నేషనల్ స్టూడెంట్ పార్లమెంట్ సదస్సులో ప్రసంగించాలని ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఆహ్వానం మేరకు కవిత వెళ్లనున్నారు. కేరళ శాసనసభ వజ్రోత్సవాల సందర్భంగా కాస్ట్ అండ్ ఇట్స్ డిస్కౌంట్స్ అనే అంశంపై ప్రసంగిస్తారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ, పుణెకు చెందిన ఎంఐటీ పీస్ వర్సిటీ సంయుక్తంగా ఫెస్టివల్ ఆన్ డెమొక్రసీ (ఎఫ్‌వోడీ) పేరిట పలు జాతీయస్థాయి సదస్సులు నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగా ఈ నెల 23 నుంచి 25 వరకు నిర్వహించే నేషనల్ స్టూడెంట్స్ పార్లమెంట్- కేరళ 2019 సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారు.