రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చే పార్టీలకే మద్దతు : సీఎం చంద్రబాబు

అమరావతి : తెలుగుదేశం పార్టీ నేతలతో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితులపై సీఎం చంద్రబాబు పార్టీ నేతలతో చర్చించారు. కుట్రలు, కుతంత్రాలు చేయడంలో మోడీ, అమిత్ షాలు బ్రహ్మాండమైన జోడీ అని చంద్రబాబు అన్నారు. అమిత్ షా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారని.. ఏమాత్రం కనువిప్పు లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఇంకా పరిష్కరించకుండా ఉన్న 18అంశాలపై ఎక్కడికక్కడ నిలదీయాలని పార్టీ నేతలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ […]

రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చే పార్టీలకే మద్దతు : సీఎం చంద్రబాబు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 22, 2019 | 11:33 AM

అమరావతి : తెలుగుదేశం పార్టీ నేతలతో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితులపై సీఎం చంద్రబాబు పార్టీ నేతలతో చర్చించారు. కుట్రలు, కుతంత్రాలు చేయడంలో మోడీ, అమిత్ షాలు బ్రహ్మాండమైన జోడీ అని చంద్రబాబు అన్నారు. అమిత్ షా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారని.. ఏమాత్రం కనువిప్పు లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఇంకా పరిష్కరించకుండా ఉన్న 18అంశాలపై ఎక్కడికక్కడ నిలదీయాలని పార్టీ నేతలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు నెరవేర్చే పార్టీలకే మన మద్దతు అని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. జాతీయ స్థాయిలో కలిసివచ్చే పార్టీలతో కలిసి నడుస్తామన్నారు సీఎం చంద్రబాబు.