రెప్పపాటులో ఘోర ప్రమాదం.. కారును ఢీకొట్టిన బైకర్.. వైరల్‌గా మారిన కేర్‌లెస్ డ్రైవింగ్‌ సీసీ టీవీ ఫుటేజ్

ట్రాఫిక్ రూల్స్, రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పిస్తోన్న సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. కేర్‌లెస్ డ్రైవింగ్‌కు సంబంధించిన సీసీటీ ఫుటేజీలను రిలీజ్ చేస్తున్నారు.

రెప్పపాటులో ఘోర ప్రమాదం.. కారును ఢీకొట్టిన బైకర్.. వైరల్‌గా మారిన కేర్‌లెస్ డ్రైవింగ్‌ సీసీ టీవీ ఫుటేజ్
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 24, 2021 | 1:32 PM

Road Accident : రోడ్డుప్రమాదాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పించిన ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డుభద్రతపై జాగ్రత్తలు ప్రయోజనం లేకుండా పోయింది. చిన్నపాటి నిర్లక్ష్యం నిండి ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. షాకింగ్ వీడియోను ట్వీట్ చేశారు. కారు డ్రైవర్ డోర్ తీయడంతో వెనుక నుంచి బైక్ మీద వేగంగా వస్తున్న వ్యక్తి కింద పడిపోయిన వీడియోను షేర్ చేశారు.

ట్రాఫిక్ రూల్స్, రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పిస్తోన్న సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. కేర్‌లెస్ డ్రైవింగ్‌కు సంబంధించిన సీసీటీ ఫుటేజీలను రిలీజ్ చేస్తున్నారు. చిన్న తప్పిదాలే ఎలాంటి తీవ్ర ప్రమాదాలకు దారి తీస్తాయనే విషయాన్ని జనాలకు అర్థమయ్యేలా వివరిస్తున్నారు. ఇటీవలే ఓ వ్యక్తి ఫోన్ చూసుకుంటూ.. రోడ్డు దాటుతుండగా.. వేగంగా దూసుకొచ్చిన బైకర్ అతణ్ని ఢీకొట్టిన వీడియోను షేర్ చేసిన సైబరాబాద్ పోలీసులు.. తాజాగా మరో వీడియోను ట్వీట్ వేదికగా షేర్ చేశారు.

ఓ వ్యక్తి బైక్ మీద వెళ్తుండగా.. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కారు డోర్‌ను అకస్మాత్తుగా తెరవడంతో.. బైక్ మీద వెళ్తున్న వ్యక్తి కారు డోర్ తగిలి కింద పడిపోయాడు. మియాపూర్ వద్ద మంగళవారం ఈ ఘటన జరిగిందని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. బైక్ మీద వెళ్తున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోలేదని.. డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని వెల్లడించారు.

కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా డోర్ తీశాడని.. వాహనాల డోర్ తీసేటప్పుడు ఓసారి ట్రాఫిక్‌ను చూసుకోవాలని సైబరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు. ఓసారి మిర్రర్‌లో చూసుకొని వెనుక నుంచి ఎవరూ రావడం లేదని నిర్ధారించుకున్న తర్వాత డోర్ తీస్తే ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. కొద్దిపాటి జాగ్రత్తలతో ప్రాణాలను నిలుపుకోవచ్చంటున్నారు. తమపై ఆధారపడ్డ కుటుంబాలను ఒంటరి చేయవద్దని సూచిస్తున్నారు.

Read Also…  Google Maps: మరో కొత్త ఫీచర్‌ తీసుకొచ్చిన గూగుల్‌ మ్యాప్స్‌.. దీంతో కళ్ల సమస్యకు చెక్‌..