దేశాన్ని మళ్లీ బిజేపీనే పాలిస్తుంది: దత్తాత్రేయ

హైదరాబాద్: పుల్వామ ఘటన తర్వాత కేంద్రం తీసుకున్న నిర్ణయాలు దేశాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లిందని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ దత్తాత్రేయ అన్నారు. మోదీ చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని వెల్లడించారు. అలాగే మోదీ పట్ల ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగిందని చెప్పారు. కేంద్రంలో మళ్లీ రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం తీసుకున్న దౌత్య నిర్ణయాలు పాకిస్థాన్‌ను ఏకాకిని చేశాయన్నారు.  పైలట్ అభినందన్ భారత్‌కు తిరిగి రావటం ఆనందించదగ్గ విషయని తెలిపారు. ఇక […]

దేశాన్ని మళ్లీ బిజేపీనే పాలిస్తుంది: దత్తాత్రేయ
Follow us

|

Updated on: Mar 01, 2019 | 7:01 PM

హైదరాబాద్: పుల్వామ ఘటన తర్వాత కేంద్రం తీసుకున్న నిర్ణయాలు దేశాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లిందని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ దత్తాత్రేయ అన్నారు. మోదీ చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని వెల్లడించారు. అలాగే మోదీ పట్ల ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగిందని చెప్పారు. కేంద్రంలో మళ్లీ రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం తీసుకున్న దౌత్య నిర్ణయాలు పాకిస్థాన్‌ను ఏకాకిని చేశాయన్నారు.  పైలట్ అభినందన్ భారత్‌కు తిరిగి రావటం ఆనందించదగ్గ విషయని తెలిపారు. ఇక అజెండాలు వేరైనా.. దేశ భద్రత విషయంలో రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావడం సంతోషకరమన్నారు. భారత ప్రభుత్వం ఉగ్రవాదులపైనే పోరాటం చేస్తోందని, పాకిస్థాన్ ప్రజలతో కాదన్నారు.
తెలంగాణలో పరిపాలన ఇంకా గాడిన పడలేదన్నారు. వివిధ ముఖ్యమైన శాఖలు సీఎం దగ్గర ఉండటం మంచిదికాదని పేర్కొన్నారు. ఫైల్స్ చూసే తీరిక కూడా ముఖ్యమంత్రికి ఉండదన్నారు. మున్సిపల్, గృహ నిర్మాణ శాఖల్లో పరిష్కరించాల్సిన అంశాలు అ‌నేకమున్నాయని చెప్పారు. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ పోటీచేస్తుందని దత్తాత్రేయ స్పష్టం చేశారు.

Latest Articles