ఆర్మీ నెక్స్ట్ టార్గెట్ కన్‌ఫర్మ్..యాక్షన్ ప్లాన్ రెడీ అన్న రావత్
నయా భారత్ నమూనా మారింది. నజర్ మారింది. నయా జోష్‌తో దూసుకెళుతున్న ఇండియన్ ఆర్మీ.. కేవలం డిఫెన్స్ మాత్రమే కాదు.. అవసరమైతే శత్రువుల గడ్డపై దూసుకెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేసి మరీ ఉగ్రవాదుల అంతు చూస్తుందని చాటుతోంది. ఈ విషయాన్ని ఇప్పటికే పలు మార్లు నిరూపించిన భారత ఆర్మీ.. తాజాగా కొత్త టార్గెట్‌ని నిర్దేశించుకునన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మాటలు తోడవడంతో భారత ఆర్మీ తదుపరి లక్ష్యం ఏంటో చూఛాయగా […]
నయా భారత్ నమూనా మారింది. నజర్ మారింది. నయా జోష్‌తో దూసుకెళుతున్న ఇండియన్ ఆర్మీ.. కేవలం డిఫెన్స్ మాత్రమే కాదు.. అవసరమైతే శత్రువుల గడ్డపై దూసుకెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేసి మరీ ఉగ్రవాదుల అంతు చూస్తుందని చాటుతోంది. ఈ విషయాన్ని ఇప్పటికే పలు మార్లు నిరూపించిన భారత ఆర్మీ.. తాజాగా కొత్త టార్గెట్‌ని నిర్దేశించుకునన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మాటలు తోడవడంతో భారత ఆర్మీ తదుపరి లక్ష్యం ఏంటో చూఛాయగా తేలిపోయింది.
మణిపూర్‌లో భారత జవాన్ల వాహనాన్ని టార్గెట్ చేసిన ఈశాన్య ఉగ్రవాదులను 2015లో తొలిసారి సర్జికల్ స్ట్రైక్‌లో మట్టుబెట్టిన భారత ఆర్మీ.. అదే ఊపులో పఠాన్ కోట్ ఆర్మీ క్యాంపుపై దాడికి పాల్పడ్డ పాక్ ఉగ్రవాదులను 28 సెప్టెంబర్ 2016 అర్ధరాత్రి సర్జికల్ స్ట్రైక్‌లో లేపేసింది.
ఆతర్వాత పుల్వామాలో సిఆర్పీఎఫ్ జవాన్లపై దాడికి తెగబడిన పాక్ ముష్కర మూఠాలను అనూహ్యంగా ఎయిర్ స్ట్రైక్ జరిపి లేపేసింది. ప్రత్యర్థుల భూభాగంలోకి చొచ్చుకు వెళ్ళి మరీ ఉగ్రముఠాలకు బుద్ది చెప్పగలమని భారత్ ఆర్మీ నిరూపించింది.
అదే ఊపును కొనసాగిస్తూ.. మిషన్ పీవోకే ప్రకటించారు భారత ఆర్మీ చీఫ్ బిపిన్‌రావత్. పీవోకేను స్వాధీనం చేసుకునే వరకు ఆపరేషన్ ఆగదని ఆయన స్పష్టం చేశారు. జమ్ము కశ్మీర్ ఇండియాలో భాగమన్న ఆయన.. పీవోకే కూడా ఇండియాలో భాగమే అని ప్రకటించారు. పాక్ ఉగ్రవాదులకు పీవోకే కేంద్రంగా ఉందన్న బిపిన్.. తమ నెక్ట్ టార్గెట్ పీఓకే అంటూ ప్రకటించారు.
ఒకప్పటి అందాల కశ్మీరంలో ఇపుడు పాక్ ఆధీనంలో వుండి.. ఉగ్రక్యాంపులకు కేంద్రంగా మారిన పి.వో.కే.తోపాటు భారత్‌లో కలిసేందుకు సిద్దంగా వున్న గిల్గిట్-బాల్టిస్తాన్ ఏరియాలు కూడా భాగమేనని.. అన్నింటినీ కలుపుకుంటేనే సువిశాల భారతమన్న మాటకు అర్థం వస్తుందన్న భావన బిపిన్ రావత్ మాటల్లో వ్యక్తమయింది.