పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరో కీలక నిర్ణయం.. రాష్ట్రంలో కొత్తగా “మా కిచెన్” పథకానికి శ్రీకారం

మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని త‌ృణమూల్ కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు.

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరో కీలక నిర్ణయం.. రాష్ట్రంలో కొత్తగా మా కిచెన్ పథకానికి శ్రీకారం
Follow us

|

Updated on: Feb 15, 2021 | 7:49 PM

అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు హీటెక్కాయి. బెంగాల్‌లో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ వ్యుహలు పన్నుతుంటే, మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని త‌ృణమూల్ కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ‘మా కిచెన్’ సెంటర్లను వీడియా కాన్ఫరెన్స్ ద్వారా సోమవారంనాడు ప్రారంభించారు. రూ.5 రూపాయలకే ప్రజలకు భోజనం అందించేందుకు ఈ పథకం ప్రవేశపెట్టారు. పేదల ప్రజలందరికీ కడుపునిండా భోజనం పెట్టడమే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకువస్తున్నట్లు ప్రకటించారు.

బెంగాల్‌లోని నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం పరిమిత సంఖ్యలో ‘మా కిచెన్లు’ ప్రారంభించామని సీఎం మమతా వెల్లడించారు. త్వరలోనే మరిన్ని సెంటర్లు పెంచుతాం. లబ్ధిదారులు కేవలం 5 రూపాయలతో భోజనం చేయవచ్చన్నారు. మీల్స్ ఒక్కంటికి రూ.15 రూపాయల సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మా కిచెన్ సెంటర్లతో పలువురికి ఉపాథి అవకాశాలు కలుగుతాయని మమతా బెనర్జీ ఈ పథకాన్ని ప్రారంభిస్తూ పేర్కొన్నారు.

అలాగే, సాల్ట్ లేక్ వద్ద ఐటీ పార్క్‌ సహా పలు ప్రాజెక్టులను ముఖ్యమంత్రి మమతా ప్రారంభించారు. రాష్ట్రంలో కేన్సర్ పేషంట్ల గుర్తింపు, చికిత్స, రిజిస్ట్రేషన్ కోసం ఇంటిగ్రేటెడ్ సిస్టమ్‌ను కూడా మమత ప్రారంభించారు. కాగా, రాష్ట్రంలోని 294 అసెంబ్లీ స్థానాలకు గాను ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి.

Read Also… తమిళనాట పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ కసరత్తు.. పుదుచ్చేరి ఎన్నికలే లక్ష్యంగా రాహుల్ పర్యటన..!