AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాట పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ కసరత్తు.. పుదుచ్చేరి ఎన్నికలే లక్ష్యంగా రాహుల్ పర్యటన..!

ఈసారి తమిళనాట వ్యుహాత్మకంగా వ్యవహరిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే దేశవ్యాప్తంగా అత్యధిక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగా, ఇటు దక్షిణాదిని కూడా సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.

తమిళనాట పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ కసరత్తు.. పుదుచ్చేరి ఎన్నికలే లక్ష్యంగా రాహుల్ పర్యటన..!
Balaraju Goud
|

Updated on: Feb 15, 2021 | 6:39 PM

Share

తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్‌ 2వ వారంలో నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఫ్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా తమిళనాడు సహా పుదుచ్చేరి, కేరళ, పశ్చిమబెంగాల్‌, అసోం రాష్ట్రాల అసెంబ్లీలకూ ఎన్నికలు నిర్వహించడంపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తమిళనాడు, పుదుచ్చేరిలో ఏప్రిల్‌ 2 వారంలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం.

అయితే, ఈసారి తమిళనాట వ్యుహాత్మకంగా వ్యవహరిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే దేశవ్యాప్తంగా అత్యధిక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగా, ఇటు దక్షిణాదిని కూడా సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు తమ పూర్వ వైభవం సాధించుకునేందుకు కాంగ్రెస్ వ్యుహలు పన్నుతోంది. ఇందులో భాగంగా పుదుచ్చేరిలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 17వ తేదీన కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ పుదుచ్చేరికి రానున్నారు. ఆరోజు రెడ్డియార్‌ మిల్‌ గ్రౌండ్‌లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగసభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత సోలైనగర్‌లో మత్స్యకారుల కుటుంబాలను పరామర్శిస్తారు. అదే విధంగా వ్యాపారుల సమాఖ్య ప్రతినిధులతో కూడా రాహుల్‌ సమావేశమవుతారని పుదుచ్చేరి రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఏవీ సుబ్రమణ్యం ఓ ప్రకటనలో తెలిపారు.

మరోవైపు, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ, వాటి అమలుకు లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేదీ పలు కొర్రీలు పెడుతున్నారు. దీంతో ఆమెను తొలగించాలంటూ నారాయణస్వామి, ఆయన మంత్రివర్గ సహచరులు నిరసన కార్యక్రమాలు, నిరహారదీక్షలతో పాటు రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌కు సైతం ఫిర్యాదు చేశారు. సంక్షేమ పథకాలు సరిగ్గా అమలుకాకపోవడంతో పార్టీ కార్యకర్తల్లోనూ కొంత నిస్తేజం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ పార్టీలో ఆ వాతావరణం కనిపించడం లేదు. దీంతో పార్టీలో పరిస్థితిని చక్క దిద్దేందుకు కాంగ్రెస్‌ సిద్ధమైనట్టు సమాచారం. ఇందులో భాగంగానే తొలుత రాహుల్‌ పుదుచ్చేరిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకోనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చదవండి… పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై అధికారుల కసరత్తు.. దివ్యాంగులు, 80 ఏళ్లపైబడిన వృద్ధులు, కొవిడ్ రోగులకు ప్రత్యేక ఏర్పాట్లు