భారత అమ్ములపొదలో మరో అస్త్రం.. మరింత ఎత్తుకు డ్రోన్ ‘రుస్టోమ్ -2’.. ప్రయోగానికి సిద్దమవుతున్న డీఆర్‌డీవో
దేశ రక్షణ అవసరాల్లో భాగంగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసిన దేశీయ మీడియం ఎలిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్ ‘రుస్టోమ్ -2’ మరో మైలురాయిని సాధించనున్నది.
India’s rustom 2 : ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆత్మనిర్బర భారత్‌లో భాగంగా ఇండియా అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. ముఖ్యంగా రక్షణ రంగాన్ని పటిష్టపరిచేందుకు కేంద్ర సంకల్పంతో ముందుకుపోతోంది. దేశ రక్షణ అవసరాల్లో భాగంగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసిన దేశీయ మీడియం ఎలిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్ ‘రుస్టోమ్ -2’ మరో మైలురాయిని సాధించనున్నది. మరింత ఎత్తు ఎగిరేలా దీనిని అప్‌గ్రేడ్ చేసినట్లు డీఆర్‌డీవో అధికారులు తెలిపారు. దీంతో ఇది 27 వేల అడుగుల ఎత్తుకుపైగా ఎగురుతుందని అధికారులు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ్‌లోని పరీక్షా కేంద్రం నుంచి ఏప్రిల్‌లో దీనిని పరీక్షించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 27 వేలకుపైగా అడుగుల ఎత్తులో ఏకధాటిగా 18 గంటలకుపైగా ఇది ఎగురుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
DRDO Yesterday flight tested the Rustom-2 UAV and achieved eight hours of flying at an altitude of 16000 feet at Chitradurga, Karnataka.#DRDO #indianarmy #indianairforce #indiannavy #Jaihind pic.twitter.com/fmWVtjxzrZ
— Defence Squad (@Defence_Squad_) October 10, 2020
వ్యూహాత్మక పర్యవేక్షణ, నిఘా కార్యకలాపాల కోసం దేశీయంగా రూపొందించిన మానవరహిత వైమానిక వాహనం (యుఏవీ) రుస్తోట్-2ను తపస్-బిహెచ్ ( టాక్టికల్ ఎయిర్‌బోర్న్ ప్లాట్‌ఫామ్ ఫర్ ఏరియల్ సర్వైలెన్స్- బియాండ్ హారిజోన్ 201) అని కూడా వ్యవహరిస్తారు. ఇది గత ఏడాది అక్టోబర్‌లో 16,000 అడుగుల ఎత్తులో ఎనిమిది గంటలు విజయవంతంగా ప్రయాణించి చివరి పరీక్షను పూర్తి చేసుకుంది. రుస్టోమ్-1ను మరింతగా ఆధునీకరించి రుస్టోమ్-2ను అభివృద్ధి చేశారు. దీన్ని ఏప్రిల్ నెలలో ప్రయోగించనున్నట్లు డీఆర్‌డీవో అధికారులు వివరించారు.
Read Also… ముచ్చటపడి రూ. 100 కోట్ల విల్లా కొన్నాడు.. మనీ లాండరింగ్ కేసులో అడ్డంగా బుక్కైయ్యాడు…