ఒకే ఫ్యామిలీ..అయితేనేం చెరోదారి?

కుటుంబ రాజకీయాలు తెలుగు రాష్ట్రాలకు కొత్త కాదు. ఫ్యామిలీ అంతా ఒకే పార్టీలో ఉండడం ఒకటైతే.. ఒకే ఫ్యామిలీ మెంబర్స్ వేర్వేరు పార్టీల్లో కొనసాగడం.. కుటుంబ ప్రయోజనాల కోసం ఎవరి దారిలో వారు పనిచేయడం రెండోది. సరిగ్గా ఇప్పుడిదే అంశం సింహపురి రాజకీయాలల్లో చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీలో చిరకాలంగా కొనసాగుతున్న బీదా మస్తాన్ రావు.. సడన్‌గా వైసీపీలో చేరిపోయారు. శుక్రవారం నాడు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు రాజీనామా లేఖను పంపిన బి.ఎం.ఆర్., శనివారం నాడు వైసీపీ […]

ఒకే ఫ్యామిలీ..అయితేనేం చెరోదారి?
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 07, 2019 | 5:33 PM

కుటుంబ రాజకీయాలు తెలుగు రాష్ట్రాలకు కొత్త కాదు. ఫ్యామిలీ అంతా ఒకే పార్టీలో ఉండడం ఒకటైతే.. ఒకే ఫ్యామిలీ మెంబర్స్ వేర్వేరు పార్టీల్లో కొనసాగడం.. కుటుంబ ప్రయోజనాల కోసం ఎవరి దారిలో వారు పనిచేయడం రెండోది. సరిగ్గా ఇప్పుడిదే అంశం సింహపురి రాజకీయాలల్లో చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీలో చిరకాలంగా కొనసాగుతున్న బీదా మస్తాన్ రావు.. సడన్‌గా వైసీపీలో చేరిపోయారు. శుక్రవారం నాడు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు రాజీనామా లేఖను పంపిన బి.ఎం.ఆర్., శనివారం నాడు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనైతే పార్టీ మారారు.. కానీ ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ అయిన బీదా రవిచంద్ర పరిస్థితి ఏంటన్న చర్చ ఇప్పుడు జోరుగా జరుగుతోంది.

బీదా రవిచంద్ర, బీదా మస్తాన్ రావు ఇద్దరు సోదరులన్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న ఈ ఇద్దరు ఇప్పుడు రెండు వేర్వేరు పార్టీల్లో వున్నారు. అయితే, రవిచంద్ర భవిష్యత్ ఏంటన్నది ఇపుడు వినిపిస్తున్న ప్రశ్న. ఆయన టిడిపిలోనే కొనసాగుతారా? లేక సోదరుని బాటలో వైసీపీకి చేరతారా అన్న చర్చ మొదలైంది. రవిచంద్ర ప్రస్తుతం నెల్లూరు జిల్లా టిడిపి అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. అదే సమయంలో ఎమ్మెల్సీగా శాసనమండలికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

అయితే.. ఇప్పుడు పార్టీ మారితే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందని ఆగుతున్నారా లేక టిడిపిలోనే స్థిరంగా కొనసాగడానికే ఇష్టపడుతున్నారా అన్నది చర్చనీయాంశం. బీదా సోదరులకు అక్వా ఇండస్ట్రీస్ వున్నాయి. ఈ వ్యాపారంలో సోదరులిద్దరు భాగస్వాములు. ఇటీవల వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన అక్వా సదస్సుకు బీదా మస్తాన్ రావు హాజరయ్యారు. దాంతో ఆయన పార్టీ మారతారన్న ప్రచారం అప్పుడే మొదలైంది. గత సంవత్సరం బీదా సోదరుల బిజినెస్ కేంద్రాలపై ఐటి దాడులు జరిగాయి. పలు కేసులు కూడా వారిపై నమోదైనట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో సోదరులిద్దరు చెరో పార్టీలో వుంటూ తమ వ్యాపారాలను పరిరక్షించుకుంటారన్న ప్రచారం కూడా మరోవైపు మొదలైంది. బీదా మస్తాన్ రావుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వారి యంగ్ ఏజ్‌లో సహ ఉద్యోగులు కావడంతో ఆ పరిచయంతో ఆయన పార్టీ మారి వుంటారని పలువురు భావిస్తున్నారు. మొత్తానికి బీదా ఫ్యామిలీ పాలిటిక్స్ ఇప్పుడు సింహపురి ప్రజలను తెగ ఆకర్షిస్తున్నాయి.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు