కుక్క పని గాడిద చేస్తే ఎలా? సజ్జన్నార్‌కు సవాల్

‘‘కుక్క చేయాల్సిన పని కుక్క చేయాలి.. గాడిద చేయాల్సిన పని గాడిద చేయాలి‘‘ ఈ మాటలు ఎవర్ని ఉద్దేశించి అన్నవో కాదు.. అన్నది అనామక వ్యక్తి కూడా కాదు.. కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి కామెంట్స్ ఇవి. రేప్ కేసులో నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన సైబరాబాద్ పోలీసులనుద్దేశించి చేసినవి. కడప జిల్లా వేంపల్లిలో తులసీరెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. దిశ అత్యాచారం, దారుణ హత్యకేసులో నిందితులు నలుగురు మరణ శిక్షకు అర్హులే కానీ […]

కుక్క పని గాడిద చేస్తే ఎలా? సజ్జన్నార్‌కు సవాల్
Follow us
Rajesh Sharma

| Edited By: Srinu

Updated on: Dec 07, 2019 | 6:42 PM

‘‘కుక్క చేయాల్సిన పని కుక్క చేయాలి.. గాడిద చేయాల్సిన పని గాడిద చేయాలి‘‘ ఈ మాటలు ఎవర్ని ఉద్దేశించి అన్నవో కాదు.. అన్నది అనామక వ్యక్తి కూడా కాదు.. కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి కామెంట్స్ ఇవి. రేప్ కేసులో నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన సైబరాబాద్ పోలీసులనుద్దేశించి చేసినవి.

కడప జిల్లా వేంపల్లిలో తులసీరెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. దిశ అత్యాచారం, దారుణ హత్యకేసులో నిందితులు నలుగురు మరణ శిక్షకు అర్హులే కానీ ఆ శిక్ష విధించాల్సింది కోర్టులు, న్యాయమూర్తులు.. కానీ పోలీసులే ఆ పని చేసేస్తే ఎలా అని తులసీరెడ్డి ప్రశ్నించారు.

శిక్ష విధించాల్సింది పోలీసులు కాదని, చాకలి, కుక్క, గాడిద అని చిన్నప్పుడు నీతి కథ చదువుకున్నామన్న సంగతి ఆయన గుర్తు చేశారు. కుక్క చేయాల్సిన పని కుక్క చేయాలి.. గాడిద చేయాల్సిన పని గాడిద చేయాలి ..ఇలా ఎవరు చేయాల్సిన పని వారు చేయాల్సి వుందని తులసీ రెడ్డి చెప్పుకొచ్చారు. ఒకరు చేయాల్సిన పని ఇంకొకరు చేస్తే అది అనేక అనర్థాలకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు.

దిశ కేసులో శిక్ష విధించాల్సింది సజ్జన్నార్ కాదు.. పోలీసులు కూడా కాదు..శిక్ష విధించాల్సింది న్యాయస్థానాలు, న్యాయమూర్తులు అని తులసీ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్‌కౌంటర్‌ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే కూడా వ్యతిరేకించిన నేపథ్యంలో తులసీరెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.