తెలంగాణ మంత్రిని కలిసిన ఏపీ టీడీపీ నేత

హైదరాబాద్: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎవరెవరిని కలుస్తున్నారనే అంశం చాలా ప్రముఖంగా మారిపోయింది. హైదరాబాద్‌లో జరుగుతున్న భేటీలో ప్రత్యేక రాజకీయ ఆకర్షణను సంతరించుకుంటున్నాయి. తాజాగా తెలంగాణ మంత్రిని ఏపీ టీడీపీ నేత కలవడం సంచలనంగా మారింది. టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ను ఏపీ టీడీపీ నేత తోట త్రిమూర్తులు కలిశారు. తలసాని నివాసినికి వెళ్లి మరీ కలిసి చర్చలు జరిపారు. దీంతో రాజకీయంగా ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఏం జరుగుతుందనేది సస్పెన్సే […]

  • Vijay K
  • Publish Date - 9:00 pm, Wed, 20 February 19
తెలంగాణ మంత్రిని కలిసిన ఏపీ టీడీపీ నేత

హైదరాబాద్: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎవరెవరిని కలుస్తున్నారనే అంశం చాలా ప్రముఖంగా మారిపోయింది. హైదరాబాద్‌లో జరుగుతున్న భేటీలో ప్రత్యేక రాజకీయ ఆకర్షణను సంతరించుకుంటున్నాయి. తాజాగా తెలంగాణ మంత్రిని ఏపీ టీడీపీ నేత కలవడం సంచలనంగా మారింది. టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ను ఏపీ టీడీపీ నేత తోట త్రిమూర్తులు కలిశారు.

తలసాని నివాసినికి వెళ్లి మరీ కలిసి చర్చలు జరిపారు. దీంతో రాజకీయంగా ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఏం జరుగుతుందనేది సస్పెన్సే అయినప్పటికీ తోట త్రిమూర్తులు వైసీపీలో చేరనున్నట్ట గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవలే టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన ఆమంచి కృష్ణ మోహన్ టీడీపీని వీడే ముందు తోట త్రిమూర్తులను కలిశారు.