AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్‌ను భారత్ టచ్ కూడా చేయలేదు: ముషారఫ్

ఇస్లామాబాద్: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య వాతావరణం వేడెక్కుతోంది. అసలు యుద్ధం సంగతి పక్కన పెడితే మాటల యుద్ధం మాత్రం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లో ఐదు పాయింట్లు ఉన్నాయని, అందులో నాలుగింటిని భారత్ టచ్ కూడా చేయలేదని అన్నారు. పుల్వామా దాడిని తాను ఖండిస్తున్నానని చెబుతూ, దాడిలో పాకిస్థాన్ ప్రమేయం ఉందంటూ చేస్తున్న […]

పాక్‌ను భారత్ టచ్ కూడా చేయలేదు: ముషారఫ్
Vijay K
| Edited By: |

Updated on: Sep 01, 2020 | 7:49 PM

Share

ఇస్లామాబాద్: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య వాతావరణం వేడెక్కుతోంది. అసలు యుద్ధం సంగతి పక్కన పెడితే మాటల యుద్ధం మాత్రం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లో ఐదు పాయింట్లు ఉన్నాయని, అందులో నాలుగింటిని భారత్ టచ్ కూడా చేయలేదని అన్నారు.

పుల్వామా దాడిని తాను ఖండిస్తున్నానని చెబుతూ, దాడిలో పాకిస్థాన్ ప్రమేయం ఉందంటూ చేస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. దాడి జరిగిన మరుసటి రోజే పాక్‌ను భారత్ తప్పుబట్టడం సరికాదని, ఘటన జరిగిన గంటల్లోనే అసలెలా తప్పుబడతారని ప్రశ్నించారు. పుల్వామా దాడికి తామే బాధ్యులమని ప్రకటించిన జైషే ఉగ్రవాద సంస్థను పాక్ ఉపేక్షించదన్నారు.

జైషేపై నిషేధం విధించాలని, ఆ సంస్థ చీఫ్ మసూద్‌పై తమకేమాత్రం సానుభూతి లేదని ముషారఫ్ స్పష్టం చేశారు. పుల్వామా దాడిలో పాక్ ప్రధాని ఇమ్రాన్ హస్తం లేదని ఆయన వెల్లడించారు. భారత్‌లో ‘ఉరి’ ఘటన తరువాత పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ సర్జికల్ దాడులు జరిపిందనడంలో నిజం లేదని ఆయన పేర్కొన్నారు. పాక్‌పై దాడులు చేస్తామని భారత్ హెచ్చరిస్తే కనుక తనే దారుణంగా నష్టపోతుందన్నారు.

Follow Us
పాన్ కార్డు రూల్స్‌లో కీలక మార్పులు ఇవే..
పాన్ కార్డు రూల్స్‌లో కీలక మార్పులు ఇవే..
సెగలు పుట్టిస్తున్న సూర్యుడు. అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల జనం
సెగలు పుట్టిస్తున్న సూర్యుడు. అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల జనం
జవాన్‌ సీక్వెల్‌.. బాద్షా బద్ధలు కొడతారా ??
జవాన్‌ సీక్వెల్‌.. బాద్షా బద్ధలు కొడతారా ??
రాహుల్‌పై ప్రతీకారం తీర్చుకున్న హేజిల్‌వుడ్.. వీడియో చూశారా..?
రాహుల్‌పై ప్రతీకారం తీర్చుకున్న హేజిల్‌వుడ్.. వీడియో చూశారా..?
ఎక్కువ బ్యాంకు అకౌంట్లు వాడితే ఏమవుతుంది..?
ఎక్కువ బ్యాంకు అకౌంట్లు వాడితే ఏమవుతుంది..?
ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ ఎలా చనిపోయారో తెలుసా..?
ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ ఎలా చనిపోయారో తెలుసా..?
భద్రాద్రి రామాలయ చరిత్రలో నవ శకం! చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో
భద్రాద్రి రామాలయ చరిత్రలో నవ శకం! చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో
ముంబై ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. వచ్చేస్తున్నాడ్రోయ్ అసలైన మొగుడు
ముంబై ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. వచ్చేస్తున్నాడ్రోయ్ అసలైన మొగుడు
డీమార్ట్‌లో షాపింగ్ చేసేవారికి బెస్ట్ టిప్.. ఈ మూడు పనులు చేస్తే.
డీమార్ట్‌లో షాపింగ్ చేసేవారికి బెస్ట్ టిప్.. ఈ మూడు పనులు చేస్తే.
కస్టమర్స్‌కు గుడ్‌న్యూస్.. జియో నుంచి కొత్త రిచార్జ్‌ ప్లాన్..
కస్టమర్స్‌కు గుడ్‌న్యూస్.. జియో నుంచి కొత్త రిచార్జ్‌ ప్లాన్..