మంత్రి బొత్స వ్యాఖ్యలు పట్టించుకోవద్దు.. మాజీ మంత్రి అచ్చెన్న
ఏపీ రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ప్రతిపక్ష నేతలు ఆయన వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ముఖ్యంగా ఆయన సొంతపార్టీ నుంచే వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, టీడీపీ ఉత్తరాంధ్ర నేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మంత్రి బొత్స వ్యాఖ్యల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రం మొత్తం జగన్ కనుసన్నల్లో నడుస్తుందని, రాజధాని విషయంలో జగన్ ఏం అనుకుంటారో అదే చేస్తారని, రాజధాని మార్చడమనేది అంత సులువు […]
ఏపీ రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ప్రతిపక్ష నేతలు ఆయన వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ముఖ్యంగా ఆయన సొంతపార్టీ నుంచే వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, టీడీపీ ఉత్తరాంధ్ర నేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మంత్రి బొత్స వ్యాఖ్యల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రం మొత్తం జగన్ కనుసన్నల్లో నడుస్తుందని, రాజధాని విషయంలో జగన్ ఏం అనుకుంటారో అదే చేస్తారని, రాజధాని మార్చడమనేది అంత సులువు కాదన్నారు అచ్చెన్నాయుడు. రాష్ట్రానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే పట్టణం రాజధాని అని విషయాన్ని వైసీపీ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలన్నారు.