AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం.. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు ఇద్దరేసి డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్లు..!

ఏపీలోని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, ఇద్దరు వైస్ ఛైర్మన్ల నియామకాన్ని చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం.. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు ఇద్దరేసి డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్లు..!
Jagan Mohan Reddy
Balaraju Goud
|

Updated on: Mar 16, 2021 | 8:16 PM

Share

AP deputy mayor, deputy chairman recruitment : పరిపాలనా సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని వివిధ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, ఇద్దరు వైస్ ఛైర్మన్ల నియామకాన్ని చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసువచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ఆర్డినెన్స్ ఆమోదానికి త్వరలోనే గవర్నర్ కు పంపుతారని ప్రభుత్వ వర్గాల సమాచారం. గవర్నర్ ఆమోదం వచ్చాక అదనపు డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్లను నియమించనున్నారు. అయితే ఈ నెల 18న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగనుంది.

కాగా, ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టాన్ని సవరించనున్నట్లు తెలుస్తోంది. ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాత ఈ నెల 18న యథాతథంగా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. ఇక పురపాలక ఎన్నికల్లో ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో వైసీపీ మొత్తం కార్పొరేషన్లను క్లీన్‌ స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే. 75 పురపాలక సంఘాలు, 11 కార్పోరేషన్లను గెలుచుకొని ప్రభంజనం సృష్టించింది. ఏపీ చరిత్రలో ఇంతవరకు ఒకే పార్టీకి రానంత మెజార్టీని వైసీపీ సొంతం చేసుకుంది. ఇక నగర పాలక సంస్థల్లో తుడిచి పెట్టుకుపోయిన టీడీపీ.. మున్సిపాలిటీలల్లోనూ బోర్లా పడింది.

ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రజలు జై కొట్టడంతో.. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ.. ఇలా మూడు ప్రాంతాల్లోనూ వైఎస్సార్‌ సీపీ ఆధిక్యం కొనసాగడం విశేషం. కనీసం ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది. ఇక జనసేన, బీజేపీ, వామపక్ష పార్టీలు అసలు పత్తా లేకుండా పోయాయి. దీంతో వైసీపీ మద్దతుతో గెలిచిన వారందరినీ సమతూల్యం పాటించేలా పార్టీ అధిష్టానం ప్రయత్నాలు మొదలు పెట్టింది. సీఎం జగన్ తీసుకురానున్న కొత్త ఆర్డినెన్స్ గవర్నర్ సంతకంతో కార్యరూపం దాల్చనున్నట్లు తెలుస్తోంది.

Read Also.. చంద్రబాబు నిజాయితీ కోర్టుల్లో నిరూపించుకో.. సవాల్ విరిసిన ఏపీ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి