Covid situation review : మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ భేటీ.. పలు కీలక అంశాలపై నిర్ణయాలు

AP Cabinet Sub committee : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నియంత్రణ, బ్లాక్ ఫంగస్ నివారణకు తీసుకోవలసిన చర్యలు, వ్యాక్సిన్, ఆక్సిజన్ బెడ్స్..

Covid situation review : మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ భేటీ..  పలు కీలక అంశాలపై నిర్ణయాలు
Ap Minister Alla Nani
Follow us

|

Updated on: May 27, 2021 | 2:50 PM

AP Cabinet Sub committee : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నియంత్రణ, బ్లాక్ ఫంగస్ నివారణకు తీసుకోవలసిన చర్యలు, వ్యాక్సిన్, ఆక్సిజన్ బెడ్స్.. తదితర అంశాలపై గ్రూప్ అఫ్ మినిస్టర్స్ సమావేశం మంగళగిరిలో ఇవాళ జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.. క్యాబినెట్ సబ్ కమిటీ కన్వీనర్ కూడా అయిన ఆళ్ల నాని అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. మంగళగిరిలోని ఏపిఐఐసి బిల్డింగ్ 6వ ఫ్లోర్‌లో నిర్వహించిన ఈ భేటీలో బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్స్ పైనా, రాష్ట్రంలో కర్ఫ్యూ అమలు జరుగుతున్న తీరు పైనా కూడా మంత్రులు కమిటీ చర్చించింది. బ్లాక్ ఫంగస్ వ్యాధి నివారణకు అన్ని చర్యలు పటిష్టంగా అమలు జరగాలని, కరోనా కష్ట కాలంలో ప్రాణాలు తెగించి రోగులకు వైద్య సేవలు అందిస్తూ విధులు నిర్వహిస్తున్న డాక్టర్స్, వైద్య సిబ్బంది, అధికారులు, శానిటేషన్ సిబ్బంది, ఆశా వర్కర్స్, వాలంటీర్స్ ఇలా.. అన్ని విభాగాల అధికారులు.. సిబ్బందికి మంత్రులు కమిటీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది.

మంత్రుల కమిటీ తీర్మానించిన పలు ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి :

> ప్రతి హాస్పిటల్ లో 50% ఆరోగ్య శ్రీ పెషేంట్స్ కు బెడ్స్ ఇవ్వాలి.

> ప్రవేట్ హాస్పిటల్స్ లో కచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు అమలు జరగాలి.

> ఆక్సిజన్ వినియోగంపై ఎప్పటికప్పుడు ఆడిట్ జరగాలి.

> ప్రతి హాస్పిటల్ లో కరోనా పెషేంట్స్ కు ఆక్సిజన్ నిల్వలు సక్రమంగా ఉండేలా చూడాలి.

> రెమిడీసివర్ ఇంజక్షన్స్ బ్లాక్ లో విక్రయిస్తే కఠినంగా వ్యవహారించాలి.

> ఇంజక్షన్స్ అన్ని హాస్పిటల్స్ లో అందుబాటులో ఉంచాలి.

> బ్లాక్ ఫంగస్ పై ప్రజల్లో భయం పోగొట్టడానికి ప్రత్యేకంగా అవగాహన కల్పించాలి.

అంతేకాదు, బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకిన రోగులకు వైద్యం నిరాకరించే హాస్పిటల్స్ పై కఠినంగా వ్యవహారించాలని కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయించారు. అధిక చార్జీలు వసూలు చేస్తున్న హాస్పిటల్స్ పై చర్యలకు వెనుకాడవద్దని ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి అదేశించారని కూడా మంత్రుల కమిటీ వెల్లడించింది. ఈ భేటీలో మంత్రి బొత్స సత్యనారాయణ, హోమ్ మినిస్టర్ మేకతోటి సుచరిత, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి, కురసాల కన్నబాబు, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఎం టి కృష్ణ బాబు, కాటంనేని భాస్కర్ ఇంకా పలువురు అధికారులు పాల్గొన్నారు.

Read also : Kannababu : రైతుల రుణాలు మాఫీ చేస్తానని ఓట్లు వేయించుకున్న బాబుకి 2019 ఎన్నికల్లో బుద్ధి చెప్పారు : కన్నబాబు

Latest Articles