ACB Raids : ఏపీ వ్యాప్తంగా మునిసిపల్ కార్యాలయాలపై ఏసీబీ తనిఖీలు..

ACB Raids : ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ తనిఖీలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగాల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో 14 టీములు, 100 మందికి పైగా అధికారులు పాల్గొన్నారు. ఉదయం నుండి ఈ ఏసీబీ సోదాలు కొనసాగాయి. రేపు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. రికార్డ్స్ మెయింటెన్స్‌లో లోపాలు, సిటిజన్ చార్ట్‌లో నిర్లక్ష్యాలు, అనుమతి లేని భవనాలకు అప్రూవల్స్, అనధికారిక పర్మిషన్స్‌తో పాటు డెస్క్‌లలో, ఫైల్స్‌లో […]

ACB Raids : ఏపీ వ్యాప్తంగా మునిసిపల్ కార్యాలయాలపై ఏసీబీ తనిఖీలు..
Follow us

| Edited By:

Updated on: Feb 18, 2020 | 6:06 PM

ACB Raids : ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ తనిఖీలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగాల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో 14 టీములు, 100 మందికి పైగా అధికారులు పాల్గొన్నారు. ఉదయం నుండి ఈ ఏసీబీ సోదాలు కొనసాగాయి. రేపు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

రికార్డ్స్ మెయింటెన్స్‌లో లోపాలు, సిటిజన్ చార్ట్‌లో నిర్లక్ష్యాలు, అనుమతి లేని భవనాలకు అప్రూవల్స్, అనధికారిక పర్మిషన్స్‌తో పాటు డెస్క్‌లలో, ఫైల్స్‌లో అనధికారిక నగదును గుర్తించారు ఏసీబీ అధికారులు. ముఖ్యంగా మునిసిపల్ ఆఫీసులతో పాటు టౌన్ ప్లానింగ్ సెక్షన్‌ను అధికారుల కార్యాలయాలపై మెరుపు దాడులు చేస్తోంది. వరుస దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో దడ పుట్టిస్తోంది ఏపీ ఏసీబీ.

బంగోలు : ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్‌లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. టౌన్ ప్లానింగ్ విభాగంలోని కీలక రికార్డులను పరిశీలించారు.  నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలు, అనుమతుల విషయంలో అవినీతికి పాల్పడ్డారన్న ఫిర్యాదులపై తనిఖీ చేశారు.

విశాఖ: జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ.. సోదాలు నిర్వహించింది.  జోన్ 1, జోన్ 5 కార్యాలయాల్లో ఏసీబీ అడిషనల్ ఎస్పీ షకీలాభాను నేతృత్వంలో అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. టాన్ ప్లానింగ్ విభాగంపై ఫిర్యాదులు అందడంతో.. రికార్డులను తనిఖీ చేశారు.

విజయవాడ: ఇక కీలకమైన విజయవాడ మునిసిపల్ కార్పోరేషన్ టౌన్ ప్లానింగ్ సెక్షన్‌లోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.  ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేశ్వరరాజు ఆధ్వర్యంలో పలు కీలక రికార్డులును పరిశీలించారు.

ఇక విజయనగరం, నెల్లూరు, అనంతపురం, తూర్పు గోదావరి, గుంటూరు, కడప జిల్లాల్లోని మున్సిపల్ కార్యాలయాలపై, టాన్ ఫ్లానింగ్ విభాగంపై ఏసీబీ అధికారులు దాడులు చేసి రికార్డులు తనిఖీ చేశారు.

ఇప్పటివరకు జరిపిన సోదాల్లో.. ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఓ ప్రైవేట్ వ్యక్తి కంప్యూటర్ పై కూర్చొని బిల్డింగ్ ప్లాన్ పనులు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అతని దగ్గర నుంచి ఐదువేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల టౌన్‌ ప్లానింగ్‌ విభాగంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో పాటు ఏసీబీకి పలు ఫిర్యాదులు అందాయి. అనుమతులు లేకుండా నిర్మించిన భవనాల పట్ల అధికారుల ఉదాసీనంగా వ్యవహరించడమే కాకుండా నిబంధనలకు విరుద్దంగా ప్లాన్లు మంజూరు చేస్తున్నారన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి.