ఐపిఎస్ అని చెప్పి అమ్మాయిని మోసం చేశాడు
న్యూఢిల్లీ: ఐపీఎస్ అని చెప్పి అమ్మాయిని మోసం చేశాడు. ఢిల్లీకి చెందిన రాజ్ అనే యువకుడు ఓ యువతిని ఐపిఎస్ అని చెప్పి నమ్మించాడు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పస్తానని లక్ష రూపాయిలు తీసుకుని ఉడాయించాడు. మోసం జరిగిందని తెలసుకున్న యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరిద్దరికీ అసలు పరిచయం ఎలా ఏర్పడిందంటే.. రాజ్ అనే వ్యక్తి తన ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో ఐపిఎస్ అని పెట్టుకున్నాడు. దీంతో […]
న్యూఢిల్లీ: ఐపీఎస్ అని చెప్పి అమ్మాయిని మోసం చేశాడు. ఢిల్లీకి చెందిన రాజ్ అనే యువకుడు ఓ యువతిని ఐపిఎస్ అని చెప్పి నమ్మించాడు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పస్తానని లక్ష రూపాయిలు తీసుకుని ఉడాయించాడు. మోసం జరిగిందని తెలసుకున్న యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే వీరిద్దరికీ అసలు పరిచయం ఎలా ఏర్పడిందంటే.. రాజ్ అనే వ్యక్తి తన ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో ఐపిఎస్ అని పెట్టుకున్నాడు. దీంతో ఆ ఫ్రొఫైల్‌ను చూసిన బాధిత అమ్మాయి అతన్ని పలకరించింది. పరిచయం పెరిగిన క్రమంలో వాళ్లు ఒక జిమ్‌లో కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అమ్మాయి దగ్గర నుంచి లక్ష రూపాయిలు తీసుకుని ఆ దొంగ ఐపిఎస్ పారిపోయాడు.