బీహార్ లో ఎన్ కౌంటర్.. మావోయిస్టు మృతి
పాట్నా : బీహార్‌లోని నవడా అటవీ ప్రాంతం తుపాకుల కాల్పుల మోతతో మార్మోగుతోంది. ఇవాళ ఉదయం నవడా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో కోబ్రా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. పోలీసుల రాకను పసిగట్టిన మావోయిస్టులు కాల్పులకు దిగారు. దీంతో పోలీసులు కూడా ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఓ మావోయిస్టు మృతిచెందగా.. మిగతా వారు తప్పించుకున్నారు.దీంతో తప్పించుకున్న మావొయిస్టుల కోసం అటవీ ప్రాంతాన్నంతటినీ పోలీసులు జల్లెడ పడుతున్నారు.