AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిహార్ లో పిడుగుపాటుకు 83 మంది మృతి

బిహార్‌లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు గడిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో పిడుగుపాటుకు గురై 83 మంది ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ప్రకటించింది. ఐదు జిల్లాల పరిధిలో ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి చనిపోయారు.

బిహార్ లో పిడుగుపాటుకు 83 మంది మృతి
Balaraju Goud
|

Updated on: Jun 25, 2020 | 9:43 PM

Share

బిహార్‌లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు గడిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో పిడుగుపాటుకు గురై 83 మంది ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ప్రకటించింది. ఐదు జిల్లాల పరిధిలో ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి 83మంది చనిపోయారు. గోపాల్‌గంజ్‌జిల్లాలో 13మంది, నవాడా నుంచి 8, సివాన్‌, భగల్పూర్‌నుంచి చెరో ఆరుగురు, దర్భాంగ, బంకా నుంచి చెరో ఐదుగురు చొప్పున.. ఇలా పలు ప్రాంతాల్లో మొత్తం 83మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికారులతో సమీక్షించారు. మృతిచెందిన వారిని ఆదుకుంటామన్నారు. రానున్న మూడు రోజుల్లో అస్సాం, మేఘాల‌య‌, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్, బిహార్‌, ప‌శ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఈ మేర‌కు ఆయా రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. జనం అవసరమైతే తప్ప బయటకు రావద్దని. ముఖ్యంగా లోత‌ట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సీనియ‌ర్ శాస్త్ర‌వేత్త ఆర్కె జెన‌మ‌ని అన్నారు.

Follow Us
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?
25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు
25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు
AP ECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్.. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు
AP ECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్.. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు
4 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి భువీ రీఎంట్రీ..!
4 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి భువీ రీఎంట్రీ..!
బర్నింగ్‌ ఇష్యూపై కమర్షియల్‌ కోర్ట్‌రూమ్‌ డ్రామా 'డ్యూ డేట్‌'
బర్నింగ్‌ ఇష్యూపై కమర్షియల్‌ కోర్ట్‌రూమ్‌ డ్రామా 'డ్యూ డేట్‌'
బెంగళూరు నుంచి దుబాయ్ వరకు..ఓ అమ్మాయి జీవితాన్ని మార్చిన 3 నగరాలు
బెంగళూరు నుంచి దుబాయ్ వరకు..ఓ అమ్మాయి జీవితాన్ని మార్చిన 3 నగరాలు
దిన ఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్
దిన ఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..