ఎంత దారుణం, జాగ్రత్తగా చూసుకోమంటే…అత్యాచారం ఆపై

మహారాష్ట్రలోని  జల్గావ్‌ జిల్లాలో సంచలనం సృష్టించిన నలుగురు పిల్లల దారుణ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు

ఎంత దారుణం, జాగ్రత్తగా చూసుకోమంటే...అత్యాచారం ఆపై
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 18, 2020 | 6:49 PM

మహారాష్ట్రలోని  జల్గావ్‌ జిల్లాలో సంచలనం సృష్టించిన నలుగురు పిల్లల దారుణ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్గావ్‌ జిల్లా రావేర్‌ సిటీకి కిలోమీటరు దూరంలో ఉన్న భోర్‌ఖేడా గ్రామం దగ్గర్లో ఓ పొలంలో పనులు చేసుకుంటూ మహతాబ్, రుమాలీబాయి బిలాల్‌ అనే దంపతులు నివశిస్తున్నారు. వీరికి ఐదుగురు సంతానం. అంతా కలిసి ఒక గుడిసె వేసుకుని అందులో నివాసం ఉంటున్నారు.  ఇటీవల బిలాల్‌ దంపతుల బంధువులు చనిపోవడంతో, కర్మకాండల్లో  పాల్గొనేందుకు స్వరాష్ట్రం మధ్యప్రదేశ్‌కు పెద్ద కుమారుడితో కలిసి వెళ్లారు. మూడేళ్ల వయసున్న చిన్న కుమార్తె, మరో 11 ఏళ్లు, ఎనిమిదేళ్ల వయసున్న ఇద్దరు కుమారులు, 13 ఏళ్ల వయసున్న ఇంకో కుమార్తెను ఇంట్లోనే వదిలేసి వెళ్లారు. కాగా తాము ఊరు వెళ్తున్నామని ఇంట్లో తమ తమ్ముళ్లు, చెల్లెళ్లు ఒంటరిగా ఉంటారని, గ్రామానికి ఇల్లు దూరంగా ఉండటంతో వారిని జాగ్రత్తగా చూసుకోవాలని బిలాల్‌ పెద్ద కుమారుడు అతని స్నేహితులను కోరాడు. ఇదే అదనుగా చూసుకున్న నిందితులు 13 ఏళ్ల వయసున్న బాలికపై కన్నేశారు. మద్యం సేవించి వచ్చి బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.

విషయం ఇంట్లో చెబుతారేమో అన్న భయంతో బాలికతో పాటు మిగతా పిల్లలను దారుణంగా గొడ్డలితో నరికి చంపి మృతదేహాలను పక్కనే ఉన్న పొలంలో పడేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డాగ్‌ స్క్వాడ్‌ సాయంతో నిందితులు రాజు అలియాస్‌ గుడ్డు, ముఖేశ్‌ సన్యాల్‌, సునీల్‌ సీతారాంలతో పాటు మరో మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసును ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, అంతవరకు ఎలాంటి విషయాలు వెల్లడించలేమని పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలంలో గొడ్డలి, రక్తంతో తడిసిన నిందితుల దుస్తులు, రెండు నాటుసారా మద్యం బాటిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ( Bigg Boss Telugu 4 : అనుకున్నదే జరిగింది, కుమార్ సాయిని పంపించేశారు ! )