బిగ్ బాస్ బ్యూటీ ఇంట్లో.. మృతదేహం! నటి రియాక్షన్
కన్నడ నటి కృషి తపండ నివాసంలో వ్యాపారవేత్త వైశాఖ్ మృతి చెందిన ఘటన తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న వదంతులపై ఆమె స్పందించారు. ఒకరి మరణాన్ని సంచలనంగా మార్చొద్దని, కుటుంబ సభ్యుల గోప్యతను గౌరవించాలని కోరారు. తాము ఓ మంచి స్నేహితుడిని కోల్పోయామని, ఆధారాలు లేని ఊహాగానాలు ప్రచారం చేయవద్దని ఎమోషనల్ పోస్టులో విజ్ఞప్తి చేశారు.
కన్నడ బిగ్ బాస్ ఫేం నటి కృషి తపండ నివాసంలో ఆమె స్నేహితుడు, వ్యాపారవేత్త వైశాఖ్ ఆత్మహత్య చేసుకోవడం కర్ణాటక వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జూన్ 24న జరగగా.. అప్పటి నుంచి కృషి తపండపై నెట్టింట రకరకాల ప్రచారం జరుగుతోంది. వైశాఖ్ ఆత్మహత్య చేసుకోవడానికి ఆమే కారణం అన్నట్లుగా కొంతమంది పోస్టులు పెడుతున్నారు. దీనిపై తాజాగా కృషి తపండ స్పందిస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఒకరి మరణం ఆ వ్యక్తి కుటుంబానికి తీరని లోటు అని.. అలాంటి సమయంలో కూడా వ్యక్తిగత గ్యోప్యతకు భంగం కలిగించేలా ప్రవర్తించొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ఓ వ్యక్తి మరణిస్తే.. దానిపై వదంతులు, ఊహాగానాలతో కొందరు తమకు నచ్చిన కథలు సృష్టిస్తున్నారని.. తాను కన్పిస్తే చాలు.. ‘మీ స్పందన ఏంటి?’ అంటూ అర్థం లేకుండా అడుగుతున్నారన్నారు. అలాంటి వాళ్లని చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా. ఒకరి నష్టాన్ని మీ హెడ్‌లైన్‌గా మార్చుకోకండి. మేమంతా ఓ మంచి స్నేహితుడిని కోల్పోయాం… అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు నటి కృషి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కన్నీళ్లు పెట్టిస్తున్న భాగ్యరాజ్ చివరి లెటర్
అసభ్యకరంగా బ్యాక్ షాట్ తీసేందుకు కెమెరామెన్ ప్రయత్నం అరిచిన హీరోయిన్ !
Rahul Ravindran: పిల్లలను చంపేస్తామనే బెదిరింపులు.. ‘ఎక్స్’ నుంచి తప్పుకున్న డైరెక్టర్
జడ్చర్లలో వింత కాకి ప్రత్యక్షం.. అపశకునం అంటున్న స్థానికులు!
సమానత్వానికి సరికొత్త పాఠం.. విద్యార్ధులతోపాటు యూనిఫాంలో ఉపాధ్యాయులు
మనుషులను చల్లబరిచే ఫ్రిజ్.. లోపల 5 నిమిషాలు కూర్చుంటే చాలు
40 అడుగుల ఎత్తు నుంచి పడ్డ టూరిస్ట్! ఏం జరిగిందో మీరే చూడండి!
పెళ్లి కాని ప్రసాద్‌లకు గుడ్ న్యూస్..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్.. ఆ తర్వాత
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి

