AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అసభ్యకరంగా బ్యాక్‌ షాట్ తీసేందుకు కెమెరామెన్ ప్రయత్నం అరిచిన హీరోయిన్ !

అసభ్యకరంగా బ్యాక్‌ షాట్ తీసేందుకు కెమెరామెన్ ప్రయత్నం అరిచిన హీరోయిన్ !

Phani CH
|

Updated on: Jul 04, 2026 | 9:10 PM

Share

అవార్డు కార్యక్రమంలో పాపరాజీలు వెనుక నుంచి ఫోటోలు తీయడానికి ప్రయత్నించడంతో బాలీవుడ్ నటి నేహా ధూపియా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "నో బ్యాక్ షాట్స్" అంటూ హెచ్చరిస్తూ, ఏ సెలబ్రిటీ పట్ల కూడా ఇలాంటి ప్రవర్తన చేయొద్దని సూచించారు. గతంలోనూ పలువురు బాలీవుడ్ నటీమణులు పాపరాజీల తీరుపై బహిరంగంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.

బాలీవుడ్‌లో ఇప్పుడు పాపరాట్‌జీ కల్చర్‌ సెలబ్రిటీల పాలిట విషంలా మారుతోంది. సెలబ్రిటీలు ఇంటి నుంచి బయటికి అడుగుపెడితే చాలు.. పొలోమని కెమెరాలు వేసుకుని పలు యాంగిల్లో ఫోటోలు వీడియోలు చేస్తూ పాపరాట్‌జీ వారిని తెగ ఇరిటేట్‌ చేస్తుంటుంది. ఈ ఇరిటేషన్‌కు తోడు.. కొందరు హీరోయిన్లను వెనక నుంచి అసభ్యకరంగా ఫోటోలు వీడియోలు తీసి నెట్టింట వైరల్ చేయడం ఎక్కువవుతోంది. దీంతో ఈ పాపరాట్‌జీ కల్చర్‌పై.. వారు తప్పుడు యాంగిల్లో ఫోటోలు తీసే తీరుపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు బహిరంగంగానే కామెంట్ చేశారు. ఇలాంటి పద్దతి మారుకోవాలని పలు సార్లు హెచ్చరించారు. ఇప్పుడు నేహా దూపియా కూడా ఇదే చేసింది. ఓ అవార్డ్‌ ఫంక్షన్‌కు వెళ్లిన నేహా దూపియా అవార్డ్ అందుకుని మీడియా లాంజ్‌కు రాగేనే.. పాపరాట్‌జీ ఒక్క సారిగా తనను చుట్టుముట్టుంది. పొగడ్తల పేరుతో వెకిలి మాటలు.. జోకులకు తోడు.. అందులో కొందరు కెమెరామెన్స్ నేహా బ్యాక్ షార్ట్ తీసుకునేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన నేహా ఒక్క సారిగా అసహనానికి గురైంది. పాపరాట్‌జీ పై సీరియస్ అయింది. నో బ్యాక్ షార్ట్స్ అంటూ అరిచింది. తననే కాదు.. ఏ సెలబ్రిటీలను కూడా బ్యాక్ షార్ట్ తీయొద్దంటూ హెచ్చరించింది. నేహా దూపియా మాత్రమే కాదు.. గతంలో జాన్వీ కపూర్ , నేహా శర్మ, మోనా సింగ్, త్రిప్తి, కరీనా, మృణాల్ ఠాకూర్ వంటి హీరోయిన్లు కూడా పాపరాట్‌జీ తీసే బ్యాక్ షార్ట్స్‌ పై సీరియస్ అయ్యారు. నేరుగా ఫోటోలు తీసుకుంటే పర్లేదు కానీ.. ఇలా దొంగ చాటున తప్పుడు యాంగిల్లో అసభ్యంగా ఫోటోలు తీయడంపై విమర్శించారు. అయితే బాలీవుడ్ సెలబ్రిటీలు పాపరాట్‌జీకి ఇదే విషయం పదే పదే చెబుతున్నా వారు మాత్రం తమ తీరు మార్చుకోవడం లేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rahul Ravindran: పిల్లలను చంపేస్తామనే బెదిరింపులు.. ‘ఎక్స్‌’ నుంచి తప్పుకున్న డైరెక్టర్

జడ్చర్లలో వింత కాకి ప్రత్యక్షం.. అపశకునం అంటున్న స్థానికులు!

సమానత్వానికి సరికొత్త పాఠం.. విద్యార్ధులతోపాటు యూనిఫాంలో ఉపాధ్యాయులు

దుకాణాల్లో కొన్న పచ్చళ్లను లొట్టలేసుకుంటూ తింటున్నారా? ఈ వీడియో చూస్తే.. వాటి జోలికి పోరు!

పదవీ విరమణకు ముందు రోజు పర్మినెంట్ ఉద్యోగం.. టీచర్‌కు వింత అనుభవం

Follow Us