తెలుగులో బిగ్ ఆఫర్స్ కోసం ఎదురుచూస్తున్న ఓజీ భామ 

04 July  2026

Pic credit - Instagram

Rajeev 

ప్రియాంక తొలిసారిగా కన్నడ సినిమా ఒంధ్‌ కథే హెళ్ల  ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే తన అందం అభినయంతో ఆకట్టుకుంది.

ప్రియాంకా అరుళ్‌ మోహన్, నాని ‘గ్యాంగ్ లీడర్’ చిత్రం ద్వారా తెలుగు సినీరంగంలోకి అడుగు పెట్టింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది.  

తమిళనాట శివ కార్తికేయన్ హీరోగా వ‌స్తున్న డాక్టర్ సినిమా, డాన్ సినిమాల్లో నటించింది. సూర్య హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమాలో చేసింది. 

సరిపోదా శనివారం సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ ఇచ్చింది. ఈ క్రమంలో తమిళ్ పై ఫోకస్ చేసింది. 

చాలా కాలం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత అమ్మడి క్రేజ్ పెరిగిపోయింది. 

ఇటీవలే మేడ్ ఇన్ కొరియా అనే సినిమాతో హిట్ అందుకుంది. ఈ సినిమా ఓటీటీలోనూ మంచి వ్యూస్ సొంతం చేసుకుంది. 

ఓజీ సినిమా తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు ప్రియాంక మోహన్ . దాంతో ఈ అమ్మడికి తెలుగులో ఛాన్స్ లు ఇవ్వడం లేదు అని గుసగుసలు వినిపిస్తున్నాయి.