సైలెంట్ అయిపోయిన చిట్టి.. బడా సినిమాల కోసం వెయిటింగ్
04 July 2026
Pic credit - Instagram
Rajeev
28 మే 1998న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జన్మించింది అందాల తార ఫరియా అబ్దుల్లా. ఆమె హిందీ-ఉర్దూ మాట్లాడే ముస్లిం కుటుంబనికి చెందినది.
అయితే సినిమాపై ఉన్న ఇష్టంతో తన కెరీర్ కోసం తెలుగు నేర్చుకుంది. ఈ వయ్యారి మొదట థియేటర్ నటిగా పనిచేసింది.
2021లో తెలుగు కామెడీ డ్రామా చిత్రం జాతి రత్నాలుతో సినిమాతో చలనచిత్ర అరంగేట్రం చేసింది. ఈ సినిమాలో ఆమె నటనకి 2022లో జరిగిన 10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్‌లో నామినేట్ చేయబడింది.
ఆమె 2022లో లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్, 2023లో రావణాసుర చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించింది.
అదే సంవత్సరం , ది జెంగాబురు కర్స్ అనే హిందీ వెబ్ సిరీస్ తో మొదటిసారి డిజిటల్ లో కనిపించింది, ఇందులో ఆమె ప్రధాన పాత్ర పోషించింది.
2024లో అల్లరి నరేష్ సరసన ఆ ఒక్కటి అడక్కు, మత్తు వదలరా 2 చిత్రల్లో నటించి మెప్పించింది. అలాగే ప్రభాస్ కల్కిలోనూ ఓ చిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకుంది.
ప్రస్తుతం పెద్ద సినిమా ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తుంది.