AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: సెంచరీతో ఇంగ్లీషోళ్ల తాట తీసిన బాపు.. టీమిండియా క్రికెట్ హిస్టరీలోనే సాధ్యం కాని రికార్డ్..!

Axar Patel 100 T20I Wickets: వయసు, అనుభవంతో సంబంధం లేకుండా నిలకడైన ప్రదర్శనతో దూసుకుపోతున్న బాపు సాధించిన ఈ రికార్డు అంత తేలిగ్గా చెరిగిపోయేది కాదు. టీ20 క్రికెట్‌లో భారత జట్టుకు అతడు ఎంతటి కీలకమైన ఆస్తి అనేది ఈ రికార్డు ద్వారా మరోసారి స్పష్టమైంది.

Venkata Chari
|

Updated on: Jul 05, 2026 | 9:25 AM

Share
భారత స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఈ గుజరాత్ స్పిన్నర్.. అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకుని, ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయ స్పిన్నర్‌గా రికార్డులకెక్కాడు.

1 / 5
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 పోరులో అక్షర్ పటేల్ ఈ అరుదైన మైలురాయిని ముద్దాడాడు. ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను తన అద్భుతమైన స్పిన్ మాయాజాలంతో బురిడీ కొట్టించి పెవిలియన్ చేర్చడం ద్వారా అక్షర్ తన కెరీర్‌లో 100వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

2 / 5
ఎంతో మంది దిగ్గజ స్పిన్నర్లకు సాధ్యం కాని ఈ ఘనతను అక్షర్ సాధించడంతో మైదానంలో సహచర ఆటగాళ్లు అతడిని అభినందనలతో ముంచెత్తారు. భారత జట్టులో అత్యంత నమ్మకమైన ఆటగాడిగా పేరొందిన అక్షర్, బంతితోనే కాకుండా బ్యాటుతోనూ జట్టుకు ఎన్నో కీలక విజయాలు అందించాడు. ఇప్పుడు బౌలింగ్‌లో ఈ చారిత్రాత్మక రికార్డుతో తన విలువ ఏంటో మరోసారి చాటిచెప్పాడు.

3 / 5
భారత క్రికెట్ జట్టులో అగ్రశ్రేణి స్పిన్నర్లుగా కొనసాగుతున్న యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లను వెనక్కి నెట్టి అక్షర్ పటేల్ ఈ అద్భుతమైన ఘనతను సొంతం చేసుకోవడం విశేషం. ఇప్పటివరకు ఏ భారతీయ స్పిన్నర్ కూడా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో 100 వికెట్ల మార్కును తాకలేకపోయారు. అక్షర్ పటేల్ తన 91వ అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అక్షర్ తర్వాత భారత స్పిన్నర్లలో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో యుజ్వేంద్ర చాహల్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

4 / 5
భారత క్రికెట్ చరిత్రను పరిశీలిస్తే, అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో వికెట్ల సెంచరీ (100 వికెట్లు) పూర్తి చేసిన మొత్తంగా నాలుగో భారతీయ బౌలర్‌గా అక్షర్ పటేల్ నిలిచాడు. అయితే అంతకుముందు ఈ ఘనత సాధించిన ముగ్గురు ఆటగాళ్లు ఫాస్ట్ బౌలర్లు కావడం గమనార్హం. స్పిన్ విభాగం నుంచి మాత్రం ఈ రికార్డులకెెక్కిన ఏకైక, మొదటి స్పిన్నర్ అక్షర్ పటేల్ మాత్రమే. కట్టడిగా బౌలింగ్ చేస్తూ, పరుగులను నియంత్రించడమే కాకుండా కీలక సమయాల్లో వికెట్లు తీయడంలో అక్షర్ శైలి విభిన్నమైనది.

5 / 5
Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు

మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?

బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?

ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..

ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?

మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?

సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..

వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్

మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!