AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడి దారుణం గంభీర్.. మంచోడిని పక్కనపెట్టి, అలాంటోడికి ఛాన్స్ ఇచ్చి, పరువు తీసుకున్నారుగా

Sunil Gavaskar Comments on Team India: వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న భారత జట్టు, తక్షణమే తమ వ్యూహాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిచ్ పరిస్థితులను అంచనా వేయడంలో విఫలమైతే ఎంత భారీ స్కోరు చేసినా ఇలాంటి పరాభవాలే ఎదురవుతాయని ఈ మ్యాచ్ మరోసారి స్పష్టం చేసింది. రాబోయే మ్యాచ్‌లలో సరైన జట్టు కూర్పుతో బరిలోకి దిగి టీమిండియా తిరిగి విజయాల బాట పట్టాలని క్రీడాభిమానులు ఆశిస్తున్నారు.

ఇదెక్కడి దారుణం గంభీర్.. మంచోడిని పక్కనపెట్టి, అలాంటోడికి ఛాన్స్ ఇచ్చి, పరువు తీసుకున్నారుగా
Sunil Gavaskar Comments On Team India Defeat
Venkata Chari
|

Updated on: Jul 05, 2026 | 11:28 AM

Share

Sunil Gavaskar Comments on Team India: టీ20 ఫార్మాట్‌లో భారత జట్టు పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఐర్లాండ్ చేతిలో వైట్‌వాష్ అనంతరం, తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లోనూ టీమిండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ముఖ్యంగా జట్టు కూర్పు విషయంలో మేనేజ్‌మెంట్ చేసిన అతిపెద్ద తప్పుపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాభవం..

వర్షం కారణంగా తొలి టీ20 రద్దు కాగా, రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు ఆరు వికెట్ల తేడాతో లాంఛనంగా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 191 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ, బౌలర్లు దానిని కాపాడుకోవడంలో దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లాండ్ యువ కెరటం జాకబ్ బెథెల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 46 బంతుల్లో 76 పరుగులతో అజేయంగా నిలిచి, మరో ఓవర్ మిగిలి ఉండగానే తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ మూడు వికెట్లు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీయగా మిగతా బౌలర్లు పూర్తిగా తేలిపోయారు.

ఇది కూడా చదవండి: వాడిని క్షమించను.. నమ్మి 7 నెలల తర్వాత ఛాన్స్ ఇస్తే నట్టేట ముంచాడు..

ఇవి కూడా చదవండి

పేసర్ల పిచ్‌పై ముగ్గురు స్పిన్నర్లా?

ఈ మ్యాచ్‌లో భారత ఓటమికి ప్రధాన కారణం తుది జట్టు ఎంపికలో చేసిన ఘోర తప్పిదమేనని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాతావరణం మేఘావృతమై (ఓవర్‌కాస్ట్) ఉన్న పరిస్థితుల్లో, పేసర్లకు అనుకూలించే పిచ్‌పై కేవలం ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగడం అందరినీ విస్మయానికి గురిచేసింది. గతంలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న యువ పేసర్ ప్రిన్స్ యాదవ్‌ను పక్కన పెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సంజు శాంసన్ స్థానంలో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చిన జట్టు యాజమాన్యం, బౌలింగ్ విభాగంలో మాత్రం ఎలాంటి మార్పు చేయకుండా మూల్యం చెల్లించుకుంది.

రవి బిష్ణోయ్ వైఫల్యం.. మండిపడుతున్న ఫ్యాన్స్..

ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన భారత్ భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. అక్షర్ పటేల్ నాలుగు ఓవర్లలో 20 పరుగులు మాత్రమే ఇచ్చి పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ, స్పెషలిస్ట్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఇంగ్లాండ్ బ్యాటర్లు బిష్ణోయ్ బౌలింగ్‌ను టార్గెట్ చేసి నాలుగు ఓవర్లలో ఏకంగా 60 పరుగులు పిండుకున్నారు. వరుణ్ చక్రవర్తి కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఒకవేళ బిష్ణోయ్ స్థానంలో ఫామ్‌లో ఉన్న ప్రిన్స్ యాదవ్‌ను ఆడించి ఉంటే, భారత్ ఈ మ్యాచ్‌ను సునాయాసంగా 50 పరుగుల తేడాతో గెలిచి ఉండేదని అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Video: విజయం ముంగిట భారత్.. కట్‌చేస్తే.. టీమిండియా కొంపముంచిన ఆ రెండు ఓవర్లు..!

సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు..

జట్టు ఎంపికపై లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఓవర్‌కాస్ట్ కండిషన్స్ ఉన్నప్పుడు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాల్సిన అవసరం ఏముంది? అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ప్రిన్స్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకొని ఉంటే ఫలితం కచ్చితంగా మనకు అనుకూలంగా ఉండేది” అని గవాస్కర్ కుండబద్దలు కొట్టారు. ఇక అరంగేట్ర మ్యాచ్‌లో 14 పరుగులు మాత్రమే చేసిన వైభవ్ సూర్యవంశీకి ఆయన మద్దతుగా నిలిచారు. “తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నప్పుడు కాస్త ఆందోళన ఉండటం సహజమే. అయినా అతను క్రీజులో ఉన్నంత సేపు చాలా ధైర్యంగా షాట్లు ఆడాడు. మరో రెండు మూడు మ్యాచ్‌లు ఆడితే వాతావరణానికి అలవాటు పడి పూర్తిగా సెట్ అవుతాడు” అని గవాస్కర్ భరోసా ఇచ్చారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us