AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింపుల్.. నీచు వాసన రాదు.. అదిరిపోయే టేస్ట్.. ఈ ఒక్క మసాలతో చికెన్ షేర్వా రుచే మారిపోతుంది..

ఆదివారం స్పెషల్‌గా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ మసాలా చికెన్ గ్రేవీ కర్రీని సులభంగా తయారు చేసుకోవచ్చు. ప్రత్యేకంగా తయారుచేసిన మసాలా పొడి, సరైన మ్యారినేషన్‌తో చికెన్ మరింత రుచిగా, జ్యూసీగా తయారవుతుంది. బిర్యానీ, అన్నం, రోటీ, చపాతీతో అద్భుతంగా సరిపోయే ఈ రెసిపీని కొత్తగా వంట నేర్చుకునేవారు కూడా సులభంగా తయారు చేయవచ్చు.

సింపుల్.. నీచు వాసన రాదు.. అదిరిపోయే టేస్ట్.. ఈ ఒక్క మసాలతో చికెన్ షేర్వా రుచే మారిపోతుంది..
Chicken Sherva Recipe
Shaik Madar Saheb
|

Updated on: Jul 05, 2026 | 11:12 AM

Share

ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్, మటన్, ఫిష్ ఉండాల్సిందే.. నాన్ వెజ్ ప్రియులు ఇష్టంగా కొనితెచ్చుకుని.. పలు రకాలుగా వండుకుని తింటారు. ముఖ్యంగా చాలా మంది చికెన్ ను తెచ్చుకుంటారు.. అయితే.. చికెన్ షేర్వా.. అందరికీ చేయడం రాదు.. కొన్ని పదార్థాలతో చేసుకుంటే.. అద్భుతంగా ఉంటుంది. ఈ స్పెషల్ మసాలా చికెన్ గ్రేవీ కర్రీ మీ ఇంట్లో వంటకు ఒక కొత్త రుచిని అందిస్తుంది. బిర్యానీ, రైస్ లేదా రోటీస్ దేనిలోకైనా సరైన కాంబినేషన్‌గా ఉండే ఈ వంటకం, ప్రత్యేకంగా తయారుచేసే మసాలాతో అద్భుతమైన రుచిని పొందుతుంది. అలాగే నీచు వాసన మాటే ఉండదు.. వంటలో కొత్తవారైనా, బ్యాచిలర్స్ అయినా ఈ రెసిపీని సులభంగా అనుసరించి రుచికరమైన చికెన్ కర్రీని తయారు చేసుకోవచ్చు.

రుచికరమైన స్పెషల్ మసాలా చికెన్ గ్రేవీ కర్రీ తయారీ విధానం

చికెన్ మ్యారినేషన్: అరకిలో లేదా.. కిలో చొప్పున మొదట శుభ్రం చేసుకున్న మీడియం సైజు చికెన్ పీసెస్ తీసుకోండి. పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, కొంచెం నూనె వేసి చికెన్‌కు బాగా పట్టించాలి. ఇలా కలిపిన చికెన్‌ను మూత పెట్టి, కనీసం అరగంట పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల చికెన్ మృదువుగా, జ్యూసీగా తయారవుతుంది.

స్పెషల్ మసాలా తయారీ:

ఈ చికెన్ కర్రీకి ప్రత్యేకమైన రుచిని అందించే మసాలా పొడిని తయారుచేయాలి. ఒక మిక్సీ జార్‌లో ఒక అంగుళం దాల్చినచెక్క, మూడు లవంగాలు, నాలుగు యాలకులు, ఒక చిన్న అనాస పువ్వు, చిన్న బిర్యానీ ఆకు వేయండి. వీటితో పాటు, అర టేబుల్ స్పూన్ ధనియాలు, అర టీస్పూన్ జీలకర్ర, ఒక టీస్పూన్ మిరియాలు, అర టీస్పూన్ గసగసాలు, ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు వేసి, మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి. ఈ మసాలా పొడిని ఎక్కువ మొత్తంలో కూడా తయారుచేసి, ఫ్రిజ్‌లో రెండు నుండి నాలుగు నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చు.

చికెన్ కర్రీ తయారీ:

స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి, మూడు టేబుల్ స్పూన్ల నూనె వేయండి. రెస్టారెంట్ రుచి కోసం కొద్దిగా బట్టర్ కూడా చేర్చుకోవచ్చు. నూనె వేడెక్కాక, ఒక టీస్పూన్ జీలకర్ర వేసి, అది కాస్త వేగిన తర్వాత, ముప్పావు కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి, గోల్డెన్ రంగు వచ్చేవరకు బాగా వేయించాలి. తరువాత, అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చివాసన పోయే వరకు వేయించాలి. పావు కప్పు టమాటా ప్యూరీ (ఒక మీడియం టమాటాను మెత్తగా రుబ్బుకుంటే సరిపోతుంది) వేసి, నూనె పైకి తేలే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి, గ్రేవీలో బాగా కలిసే వరకు తిప్పండి.

ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ను వేసి, గ్రేవీతో బాగా కలిపి, మూత పెట్టి మీడియం మంటపై చికెన్ నుండి నీరు ఊరి, చికెన్ ఉడికి, నూనె పైకి తేలే వరకు ఉడికించండి. చికెన్ ఉడికి నూనె వేరైన తర్వాత, రెండు పచ్చిమిర్చిని చీల్చి, రెండు రెమ్మల కరివేపాకు, ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన పుదీనా వేసి, రెండు నిమిషాలు వేయించండి.

చివరగా, ముందుగా తయారుచేసుకున్న స్పెషల్ మసాలా పొడి మొత్తాన్ని వేసి, మరో రెండు నిమిషాల పాటు మీడియం మంటపై చికెన్‌ను కలపాలి. మసాలా నూనెలో వేగి, చికెన్‌కు బాగా పట్టాలి. రెండు నుండి మూడు నిమిషాలు వేయించిన తర్వాత, గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా పావు నుండి అర కప్పు వరకు నీరు పోసి, అంతా కలిపి ఉప్పు సరిచూసుకోండి.

మూత పెట్టి, తక్కువ నుండి మధ్యస్థ మంటపై ఐదు నిమిషాల పాటు ఉడికించండి. నూనె చక్కగా పైకి తేలి, గ్రేవీ చిక్కబడుతుంది. స్టవ్ ఆపేసి, సన్నగా తరిగిన కొత్తిమీర, కావాలంటే కొద్దిగా కసూరీ మేథీ వేసి కలిపి పక్కకు దించేసుకోవడమే.

ఇలా చేస్తే చాలు.. ఎంతో రుచికరమైన స్పెషల్ మసాలా చికెన్ గ్రేవీ కర్రీ సిద్ధం అవుతుంది. ఈ పద్ధతిలో చేసిన చికెన్ కర్రీని ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రాహు దోషం వేధిస్తోందా? నెమలి ఈకతో ఈ ఒక్క పని చేస్తే శుభ ఫలితాలు..
రాహు దోషం వేధిస్తోందా? నెమలి ఈకతో ఈ ఒక్క పని చేస్తే శుభ ఫలితాలు..
రుచికరమైన స్పెషల్ మసాలా చికెన్ గ్రేవీ కర్రీ ఇలా తయారు చేసుకోండి
రుచికరమైన స్పెషల్ మసాలా చికెన్ గ్రేవీ కర్రీ ఇలా తయారు చేసుకోండి
అత్తవారింటి వేధింపులు,ఆర్థిక ఇబ్బందులతో జీవితం అతలాకుతలం
అత్తవారింటి వేధింపులు,ఆర్థిక ఇబ్బందులతో జీవితం అతలాకుతలం
ఆముదం అద్భుత లాభాలు..ఆరోగ్యం,అందానికి సహజ ఔషధం..తప్పక తెలుసుకోండి
ఆముదం అద్భుత లాభాలు..ఆరోగ్యం,అందానికి సహజ ఔషధం..తప్పక తెలుసుకోండి
సైడ్ నో బాల్ అంటే ఏంటి..? రవి బిష్ణోయ్ చేసిన బ్లండర్ మిస్టేక్ ఇదే
సైడ్ నో బాల్ అంటే ఏంటి..? రవి బిష్ణోయ్ చేసిన బ్లండర్ మిస్టేక్ ఇదే
అప్పట్లో ఓ ఊపు ఊపేసింది..
అప్పట్లో ఓ ఊపు ఊపేసింది..
అమెజాన్ సేల్‌లో కళ్లు చెదిరే ఆఫర్‌.. ఐఫోన్ 16 కేవలం రూ.59,755కే..
అమెజాన్ సేల్‌లో కళ్లు చెదిరే ఆఫర్‌.. ఐఫోన్ 16 కేవలం రూ.59,755కే..
ఉద్యోగాల భర్తీపై పోలీస్ శాఖ కీలక ప్రకటన.. ఏ డిపార్ట్‌మెంట్‌లో..
ఉద్యోగాల భర్తీపై పోలీస్ శాఖ కీలక ప్రకటన.. ఏ డిపార్ట్‌మెంట్‌లో..
ఇకనైనా టీమిండియా నుంచి తప్పుకోండ్రా బాబు..
ఇకనైనా టీమిండియా నుంచి తప్పుకోండ్రా బాబు..
అప్పట్లో చుట్టాలు ఇంటికొస్తే పచ్చి కారంతో ఇలా చేసి పెట్టేవాళ్లు
అప్పట్లో చుట్టాలు ఇంటికొస్తే పచ్చి కారంతో ఇలా చేసి పెట్టేవాళ్లు